iDreamPost

ఆన్‌లైన్‌ గేమ్‌లో లక్షలు పోగొట్టిన యువకుడు! చావే దిక్కని..

  • Published Mar 22, 2024 | 12:10 PMUpdated Mar 22, 2024 | 12:14 PM

ప్రస్తుత కాలంలో చాలామంది తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఆన్ లైన్ గేమ్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే వాటికి బానిసలై లక్షల కొలది నగదును పొగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ఆన్ లైన్ గేమ్స్ ఊభిలో మరో యువకుడు కూడా చిక్కుకున్నాడు. కాగా, ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలచనతో అతని చేసిన పనికి జరగాల్సిన నష్టమే జరిగిపోయింది.

ప్రస్తుత కాలంలో చాలామంది తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఆన్ లైన్ గేమ్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే వాటికి బానిసలై లక్షల కొలది నగదును పొగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ఆన్ లైన్ గేమ్స్ ఊభిలో మరో యువకుడు కూడా చిక్కుకున్నాడు. కాగా, ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలచనతో అతని చేసిన పనికి జరగాల్సిన నష్టమే జరిగిపోయింది.

  • Published Mar 22, 2024 | 12:10 PMUpdated Mar 22, 2024 | 12:14 PM
ఆన్‌లైన్‌ గేమ్‌లో లక్షలు పోగొట్టిన యువకుడు! చావే దిక్కని..

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏదీ మంచో, ఏదీ చెడో తెలుసుకోలేని అజ్ఞాతంలో ఉన్నారు నేటి యువత. ముఖ్యంగా టీనేజ్ యువత అయితే సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ మోజులో పడి.. విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. వీటికి బానిసలుగా మారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. అయితే ఎక్కువ శాతం మంది యువత.. క్రికెట్ బెట్టింగ్స్, రమ్మీ, పబ్జీ వంటి ఆన్ లైన్ గేమ్స్ ఉచ్చులో పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆన్ లైన్ గేమ్స్ లో లక్షల కొలది డబ్బును పొగొట్టుకోవడంతో.. మనస్థాపానికి గురైయ్యి.. ఇలా అర్ధరంతరంగా తనువు చలిస్తున్నారు. తాజాగా హనుమకొండలోని ఈఆన్ లైన్ గేమ్స్ ఊభిలో మరో యువకుడు  చిక్కుకున్నాడు. ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలచనతో అతని చేసిన పనికి జరగాల్సిన నష్టమే జరిగిపోయింది.

నేటి యువత ఒక్క రోజులో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఆన్ లైన్ గేమ్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే వాటికి బానిసలై ఇళ్లను, పొలాలను, బంగారంను ఇలా ఏదో ఒక రూపంలో లక్షలకు లక్షలు పొగొట్టుకుంటున్నారు. ఇక ఉన్నదంతా పొగొట్టుకోవడంతో.. మనస్తపానికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఆన్ లైన్ గేమ్స్ ఊభిలో పడి మరో యువకుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుడి తల్లి పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. పరకాలలోని వెలుమవాడకు చెందిన ఎండీ గౌస్‌పాషా.. గుడెప్పాడ్‌లోని జీకే పెట్రోల్‌ బంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, గౌస్‌పాషా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనే ఆలోచనతో రమ్మీ ఆన్‌లైన్‌ గేమ్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే వాటికి బానిసగా మారి.. బంక్‌కు సంబంధించిన రూ.6లక్షలు పొగొట్టుకున్నాడు. దీంతో బంక్‌ యజమానులు అతని పై ఈ నెల 18న ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక అంతటితో ఆగకుండా.. ఆ డబ్బులు ఎలా అయిన గౌస్‌పాషా వద్ద రికవరీ చేసేందుకు అతడి ఇంటిని రూ.100 స్టాంప్‌ కాగితంపై రాయించుకున్నారు. దీంతో అదే రోజు ఇంటికి చేరుకున్న గౌస్‌పాషా.. ఎంతో కష్టపడి తన తల్లిదండ్రులు కట్టుకున్న ఆ ఇంటిని బంక్‌ యజమానులు రాయించుకోవడం తెలిస్తే తట్టుకోలేరని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే.. ఈ నెల 19న అతడు పురుగుల మందు తాగాడు. అలాగే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని..మీరంతా తనను మరిచిపోవాలని తల్లి, తమ్ముడికి ఫోన్‌ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన వారు పోలీసులను సంప్రదించారు. కాగా, గౌస్‌పాషా పరకాల బంధం రోడ్డులో క్రిమిసంహారక మందు తాగి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే తన కొడుకు ఆత్మహత్యయత్నానికి బంక్‌ యాజమానుల వేధింపులే కారణమని బాధితుడి తల్లి ఎండీ ఫర్వీనా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పరకాల సీఐ రవిరాజుకు ఫోన్‌చేయగా ఆయన ఇంకా స్పందించలేదని సమాచారం అందింది. మరి, ఆన్ లైన్ గేమ్స్ ఉచ్చులో పడిన యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి