iDreamPost

యూట్యూబ్ వీడియోలతో రూ.400 కోట్ల సంపాదన.. బెంజ్,రోల్స్ రాయిస్,రేంజ్ రోవర్ !

  • Published Jan 09, 2024 | 6:00 PMUpdated Jan 09, 2024 | 6:17 PM

ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో ముందు ఉంది యూట్యూబ్. కొన్ని వందల మంది యూట్యూబర్లు వీడియోలు చేసి, వాటిని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ.. దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా ఓ వ్యక్తి కేవలం యూట్యూబ్ ద్వారా రూ.400 కోట్లను సంపాదించాడు.

ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో ముందు ఉంది యూట్యూబ్. కొన్ని వందల మంది యూట్యూబర్లు వీడియోలు చేసి, వాటిని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ.. దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా ఓ వ్యక్తి కేవలం యూట్యూబ్ ద్వారా రూ.400 కోట్లను సంపాదించాడు.

  • Published Jan 09, 2024 | 6:00 PMUpdated Jan 09, 2024 | 6:17 PM
యూట్యూబ్ వీడియోలతో రూ.400 కోట్ల సంపాదన.. బెంజ్,రోల్స్ రాయిస్,రేంజ్ రోవర్ !

ఇప్పుడు సామజిక మాధ్యమాలలో ఎవరికి నచ్చిన విధంగా వారు వీడియోస్ తీస్తూ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గరనుంచి మనం కొన్ని వందల పోస్ట్స్ ను చూస్తూనే ఉంటాము. వాటిలో అన్ని పోస్ట్స్ మనకి ఉపయోగపడతాయా అంటే లేదనే చెప్పాలి. వాటిలో ఏవో కొన్ని పోస్ట్స్ లో మాత్రమే మనకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది. ఇలా యూట్యూబ్ లో అందరికి ఉపయోగపడే వీడియోలు పెడుతూ.. కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంటూ.. ఫాలోవర్స్ తో పాటు మంచి ఇన్ కమ్ ను కూడా సంపాదించేవారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అసలు వారు ఎవరో కొంతమందికి కూడా తెలియని స్థాయి నుంచి.. ఇప్పుడు ప్రపంచం వారిని గుర్తించే స్థాయి వరకు ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే చేతులో రూకలు లేని స్థితి నుంచి.. రెండు చేతుల కొన్ని కోట్లు సంపాదించే స్థితి వరకు కూడా ఎదిగిన వారు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే.

అన్ని కోట్లు సంపాదించాడంటే ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడో.. అతనికి ఎంత డబ్బు ఉండి ఉంటుందో అని అనుకోవచ్చు. ఇతను పెట్టుబడి పెట్టిన మాట నిజమే.. కానీ ఇతను ఓ నిరుపేద. ఈ నిరుపేద పెట్టిన పెట్టుబడి అతని టాలెంట్, సాధన, కృషి, లక్ష్య సాధనపై అతని నమ్మకం. అవును కేవలం వీటిని పెట్టుబడిగా పెట్టి.. యూట్యూబ్ లో కొన్ని కోట్ల మందికి టెక్ వీడియోస్ ను బోధిస్తూ రూ.400 కోట్లను సంపాదిస్తున్నాడు  ఈ వ్యక్తి. విలాసవంతమైన ఇల్లు, బెంజ్,రోల్స్ రాయిస్,రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు , ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర కాస్టలీ మొబైల్స్ ఇవన్నీ ఇపుడు ఇతని సొంతం. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ లా అందరు పుట్టుకతోనే ధనవంతులు అవ్వలేరు కదా.. కొంతమంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చి .. స్వయంగా తమకున్న టాలెంట్ తో ఈ ప్రపంచానికి పరిచయం అయ్యి.. ఎంతో మంది గుర్తించేలా క్రమ క్రమంగా ఎదుగుతారు. ఈ వ్యక్తి కూడా ఆ కోవకు చెందినవాడే ఆ వ్యక్తి మరెవరో కాదు.. మన దేశంలో టాప్ టెక్ గురుగా మంచి పేరు సంపాదించుకున్న “గౌరవ్”. ఇతని ఈ స్థాయి వరకు ఎదిగిన ప్రక్రియ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

400cr networth by doing youtube videos

గౌరవ్ తన చిన్నతనంలో రాజస్థాన్ లోని ఆజమీర్ లో ఉండేవాడు. వీరు అదే ప్రాంతంలో చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉండేవారు. ఇతని తండ్రి వీధి చివరన చిన్న కిరాణా షాప్ ను నడిపేవాడు. ఆ షాప్ మీద వచ్చే ఆదాయం సరిపోక ఇతని తండ్రి పనికోసం దుబాయ్ కు వెళ్ళాడు. ఆ క్రమంలో గౌరవ్ చదువుకుంటూనే తన తల్లితో కలిసి కిరాణా షాప్ ను చూసుకుంటూ ఉండేవాడు. చిన్నతనంలోనే అన్ని కష్టాలను చూసిన గౌరవ్ కు.. ఎలాగైనా రెండు చేతుల డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఆ వయస్సులోనే బలంగా నాటుకుపోయింది. దీనితో అతను ఇంటర్మీడియట్ కు వచ్చే సరికి.. తన స్నేహితుల వలన టెక్నాలజీ మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. దాని గురించి తానే సొంతంగా సెర్చ్ చేసి.. నేర్చుకునేవాడు. గౌరవ్ కు టెక్నాలజీ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి అతని లెక్చరర్స్ కూడా బాగా సపోర్ట్ చేశేవారు. కానీ, అతను తండ్రి మాత్రం ఇంటర్ తర్వాత ఎదో ఒక ఉద్యోగంలో చేర్పించాలని గౌరవ్ ను.. పై చదువులు చదవనివ్వకుండా దుబాయ్ కు తీసుకువెళ్లిపోయాడు.

కానీ, గౌరవ్ కు అక్కడ ఉద్యోగం చేయడం ఇష్టం లేక.. ఎలాగైనా చదువుకోవాలి అనే సంకల్పంతో.. కష్టపడి చదివి దుబాయ్ లోనే బిట్స్ బిలానిలో సీట్ సంపాదించి అక్కడ మైక్రో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ లో జాయిన్ అయ్యాడు. ఇతనికి టెక్నాలజీ మీద ఆసక్తికి కాలేజీ యాజమాన్యం కూడా తన చదువు అయిపోయే వరకు.. అతనికి అడుగడుగునా సపోర్ట్ చేస్తూ వచ్చింది. 2012లో గౌరవ్ తన ఎడ్యుకేషన్ ను పూర్తి చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ లో.. సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్ సర్వీస్ ఇంజనీర్ గా పనిచేశాడు. ఆ క్రమంలోనే అతను టెక్నాలజీ పరంగా ఇంటర్నెట్ లో కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నాడు. కొంతకాలం ఉద్యోగం చేసి అతని కుటుంబం అప్పులన్నీ తీరిపోయిన తరువాత.. ఆ ఉద్యోగాన్ని విరమించుకుని.. 2015లో “టెక్నికల్ గురూజీ” పేరుతో యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశాడు. ఈ ఛానల్ లో కొత్తగా వచ్చిన స్మార్ట్ గ్యాడ్జెట్స్ గురించి వీడియోస్ చేస్తూ పోస్ట్ చేశేవాడు. బ్యాంకింగ్ విషయాలు, డిజిటల్ మోసాలు ఇలా ప్రతి విషయాన్నీ అందరికి అర్ధమయ్యే విధంగా సింపుల్ గా చెప్పడం ఇతని ప్రత్యేకత. అలా క్రమ క్రమంగా అతను చెప్తున్న కంటెంట్ ఆడియన్సుకు బాగా కనెక్ట్ అయ్యేది. దీనితో యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ తో పాటు అతని ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది.

400cr networth by doing youtube videos

ఇక ప్రస్తుతం దేశంలోనే అత్యధిక మంది సబ్ స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ గా గౌరవ్ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వస్తున్న అప్ డేట్స్ ను క్లియర్ గా తన ఛానల్ లో వివరిస్తూ ఉంటాడు. ప్రముఖ టెక్ కంపెనీలైన వన్ ప్లస్, శాంసంగ్, గూగుల్ సంస్థలు గౌరవ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి టెక్నాలజీ వివరాలను పంచుకుంటూ ఉంటారు. వారి ఆఫీస్ లో వీడియోలు చేసుకోడానికి కూడా ఇతనికి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. ఇతను త్వరలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ను కూడా కలవబోతున్నాడు. యాపిల్ సీఈఓ ఇతని వీడియోలు చూసి.. ఈ ఏడాది మొదట్లో ముంబైలో జరగబోతున్న యాపిల్ స్టోర్ ప్రారంభోత్సవానికి.. గౌరవ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. ఇలా గౌరవ్ చిన్న తనంలో కన్న ప్రతి కలను సాకారం చేసుకుంటూ వస్తున్నాడు. ఇతని జీవిత ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. మరి, టెక్ గురు గౌరవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి