iDreamPost

చనిపోయిన తండ్రిపై ప్రేమ.. రూ. 3 కోట్ల విలువైన భూమి దానం!

  • Published Mar 04, 2024 | 3:32 PMUpdated Mar 04, 2024 | 3:32 PM

సాధారణంగా చాలామంది తల్లిదండ్రుల పై ఉన్న ప్రేమను రకరకాలుగా చాటుకుంటారు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా తన తండ్రి గురించి ఏకంగా కోట్లు విలువ చేసే భూమిని ఏం చేశాడంటే..

సాధారణంగా చాలామంది తల్లిదండ్రుల పై ఉన్న ప్రేమను రకరకాలుగా చాటుకుంటారు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా తన తండ్రి గురించి ఏకంగా కోట్లు విలువ చేసే భూమిని ఏం చేశాడంటే..

  • Published Mar 04, 2024 | 3:32 PMUpdated Mar 04, 2024 | 3:32 PM
చనిపోయిన తండ్రిపై ప్రేమ.. రూ. 3 కోట్ల విలువైన భూమి దానం!

ప్రతిఒక్కరూ తమకు జన్మనిచ్చి, కష్టపడి పెంచిన తల్లిదండ్రల గురించి ఏదో ఒకటి చేయాలని చాలా తపన పడుతుంటారు.ఈ క్రమంలోనే చాలామంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు సేవ చేస్తుంటారు. కానీ, ఈ ఆవకాశం అందరికి దొరకదు. ఎందుకంటే.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు లైఫ్ లో సక్సెస్ ఫుల్ గా ఎదిగినప్పటికి వారు బ్రతికి ఉండారు. ఇలా వారి జ్ఞాపకార్థంగా ఎంతోమంది ట్రస్ట్ లను నడిపించి నలుగురికి సేవ చేయడం, వాళ్లకు విగ్రహాలను రూపొందించి గుడి కట్టడం వంటివి చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం కొందరు
తల్లిదండ్రులు బతికుండగానే ఆస్తి పంపకాలు చేయమని వేధించడం, ఇబ్బందులకు గురి చేస్తుంటారు. మరి అలాంటి మనుషులు ఉన్నా ఈరోజుల్లో ఓ వ్యక్తి మాత్రం తన తండ్రి జ్ఞాపకార్థంగా ఏకంగా అన్ని కోట్ల విలువగల భూమిని విరాళంగా ఓ సంస్థకు ఇచ్చేశాడు.

సాధారణంగా చాలామంది తల్లిదండ్రుల పై ఉన్న ప్రేమను రకరకాలుగా చాటుకుంటారు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తన తండ్రి పై ఉన్న ప్రేమతో ఏకంగా భారీ విరాళం అందించాడు. సుమారు రూ. 3 కోట్లు విలువగల తొమ్మిదిన్నర ఎకరాల భూమిని విరాళంగా ఇస్కాన్ సంస్థకు అందించి తన తండ్రి పై ప్రేమను చాటుకున్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం హన్మాన్‌ఫారం గ్రామానికి చెందిన కొండపావులూరి శ్రీనివాస్‌ రావు హైదరాబాద్‌లోనే ఉంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. మండలంలోని శాఖాపూర్‌ శివారులో ఈయనకు తొమ్మిదిన్నర ఎకరాల సాగు భూమి ఉంది. ఆ భూమిని తన తండ్రి వెంకటేశ్వరావు జ్ఞాపకార్థంగా ఇస్కాన్‌ సంస్థకు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ క్రమంలోనే నిన్న అనగా ఆదివారం ( మార్చి3) న ఆ భూమిలో శ్రీనివాస్ రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఈ భూమిని శ్రీకృష్ణ మందిరం, వృద్ధాశ్రమం, గోశాలతో పాటు ఇతర భవనాల నిర్మాణం కోసం.. ఇస్కాన్ సంస్థకు అందించామని శ్రీనివాస్ రావు తెలిపారు. అనంతరం దీనితో పాటు తమ స్వగ్రామంలో రూ.లక్షతో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇస్కాన్‌ ప్రతినిధులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి, తన తండ్రి జ్ఞాపకార్థంగా పెద్ద మనసుతో ఆలోచించి అన్ని కోట్ల విలువగల భూమిని విరాళంగా ఇస్కాన్ సంస్థకు అందజేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి