iDreamPost

IND vs SA: సఫారీ బౌలర్ డెడ్లీ బౌన్సర్.. శార్దూల్ కు తప్పిన ప్రమాదం!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలిరోజు ఆటలో సఫారీ బౌలర్ వేసిన డెడ్లీ బౌన్సర్ కు భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు పెను ప్రమాదం తప్పింది.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలిరోజు ఆటలో సఫారీ బౌలర్ వేసిన డెడ్లీ బౌన్సర్ కు భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు పెను ప్రమాదం తప్పింది.

IND vs SA: సఫారీ బౌలర్ డెడ్లీ బౌన్సర్.. శార్దూల్ కు తప్పిన ప్రమాదం!

సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించి.. చరిత్రను తిరగరాయాలి అనుకున్న టీమిండియాకు తొలి టెస్ట్ లో తొలిరోజే షాకిచ్చారు సఫారీ బౌలర్లు. నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను భయపెట్టారు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మిగతా ఆటగాళ్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ చేరుతుంటే.. తన క్లాసిక్ ఆటతో ప్రోటీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఆటముగిసే సమయానికి 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ లతో 70 పరుగులతో అజేయంగా బ్యాంటింగ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో సఫారీ బౌలర్ వేసిన డెడ్లీ బౌన్సర్ కు భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు పెను ప్రమాదం తప్పింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో పై చేయి సాధించింది ఆతిథ్య జట్టు. తమ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ.. టీమిండియా బ్యాటర్లకు చుక్కలు చూపించారు.రాకాసి బౌన్సర్లలో భారత బ్యాట్స్ మెన్ లను భయపెట్టారు.ఇక ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కోయిట్జీ వేసిన ఓ డెడ్లీ బౌన్సర్ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను గాయపర్చింది. అసలు ఏం జరిగిందంటే? భారత తొలి ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేయడానికి వచ్చాడు ప్రోటీస్ యంగ్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీ. ఈ ఓవర్ లో 3వ బంతిని గంటకు 148 కి.మీ వేగంతో బౌన్సర్ గా సంధించాడు. అయితే ఆ డెడ్లీ బౌన్సర్ ను ఫుల్ షాట్ ఆడబోయాడు శార్దూల్. కానీ బాల్ ను సరిగ్గా అంచనా వేయడంలో అతడు విఫలం అయ్యాడు.

Shardul missed the danger!

దీంతో బాల్ శార్దూల్ హెల్మెట్ కు బలంగా తాకింది. ఆ నొప్పితో అతడు విలవిల్లాడు. శార్దూల్ నుదిటిపై వెంటనే వాపు వచ్చింది. హుటాహుటిన ఫిజియో గ్రౌండ్ లోకి వచ్చి.. కంకషన్ టెస్ట్ చేశాడు. ప్రమాదం ఏమీ లేదని తేలడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించాడు శార్దూల్. మరో ఓవర్ లో రబాడ వేసిన బంతి శార్దూల్ చేతికి తగిలింది. దీంతో మరోసారి ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయితే దెబ్బ తగిలిన తర్వాతి బంతికే శార్దూల్ 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రబాడా బౌలింగ్ లో అవుటైయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిరోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది టీమిండియా. జట్టులో విరాట్ కోహ్లీ(38), శ్రేయస్ అయ్యర్(31), కేఎల్ రాహుల్(70, బ్యాటింగ్) పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో రబాడ 5 వికెట్లతో టీమిండియా నడ్డివిరిచాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి