iDreamPost

ఎలక్ట్రిక్‌ స్కూటీపై కస్టమర్‌ ఫిర్యాదు! ఊహించని రిప్లై ఇచ్చిన కంపెనీ

  • Published Apr 06, 2024 | 1:49 PMUpdated Apr 06, 2024 | 2:21 PM

Electric Vehicles: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన ఎలక్ట్రిక్ వాహనాల హవా రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ అదే స్థాయిలో ఆ వావాహనాల వలన వినియోగదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడం, పేలుడు ఏర్పడి చాలామంది మరణించడం వంటి సంఘటనలే ఎక్కవగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ ఎలక్ట్రిక్ వావాహనం వలన ఓ వినియోగదారుడుకి కొత్త సమస్య ఎదురైంది.

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన ఎలక్ట్రిక్ వాహనాల హవా రోజు రోజుకి పెరిగిపోతుంది. కేవలం అతి తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడంతో చాలామంది వీటికే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నారు. అలాగే , పర్యావరణ అనుకూలత సౌలభ్యం కారణంగా.. ప్రభుత్వలు కడా సహజ ఇంధన వాహనాల స్థానంలో విద్యుత్ శ్రేణి వాహనాలు ప్రోత్సహిస్తుండటంతో వీటి కొనుగోళ్లు, మార్కెట్ లో వీటి డిమాండ్ బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు కొత్త కొత్ మోడల్స్ తో కార్లు, బైక్స్ వంటి తమ ఉత్పత్తులను మార్కెట్ లాంచ్ చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో అనే పేలుడు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకస్మాత్తుగా ఈ వావాహనాల్లో మంటలు  చెలరేగడం, పేలుడు ఏర్పడి చాలామంది మరణించడం వంటి సంఘటనలే ఎక్కవగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వినియోగదారుడికి ఈ ఎలక్ట్రిక్ వాహనం వలన ఎదురైన చేదు అనుభవన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకొని ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఈ మధ్య ఎలక్ట్రిక్ వావాహనాల్లో కొన్ని సాంకేతికత లోపల చాలామంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా.. ఉన్నటుండి వావాహనాల్లో.. మంటలు చెలరేగడం, కొద్దిపాటి వర్షాల సమయంలో మొరాయించడం వంటి సంఘటనల వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్లన ఈ ఎలక్ట్రిక్ వావాహనాలను కొనుగోలు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచింపచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వినియోగదారుడకి ఈ ఎలక్ట్రిక్ వావాహనం సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్‌ కావడంతో.. సమయానికి ఆఫీసుకు చేరుకోలేకపోయినట్లు తన ఎక్స్ ఖాతాలో చెప్పుకొచ్చాడు. ఇక ఆ ఫోస్ట్ చేసిన వ్యక్తి పేరు ప్రతీక్ రాయ్. ఇతను రోజులాగే తన ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్‌ని ఉపయోగించి కార్యాలయానికి వెళ్లడానికి బయలదేరాడు. కానీ, అతను వాహనాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు, స్క్రీన్ మీద అప్‌డేట్ ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు గమనించాడు. అదికాస్తా పూర్తవ్వడానకి చాలా సమయం తీసుకోవడంతో.. ఆఫీసుకు ఆలస్యంగా చేరుకోవాల్సి వచ్చింది.

అందువల్ల అతను తన ఎక్స్ ఖాతాలో ఓ ఫోస్ట్ రాసుకొచ్చాడు. ‘ఇది చాలా కొత్త సమస్య. నేను ఉదయం బైక్ ఆన్ చేసినప్పుడు నా ఏథర్ వాహనం అప్‌డేట్ అవడం ప్రారంభించింది. అప్పుడు ఆ బండి ముందుకు కదలలేక, నేను ఆఫీసుకు సమయానికి వెళ్లలేకపోయాను. పై ఆ స్కూటర్ అప్‌డేట్ చాల సమయం పట్టడంతో నేను ఆఫీసుకి చాలా ఆలస్యంగా వెళ్లాను’ అంటూ తన పోస్ట్‌లో తెలిపారు. అయితే ఈ పోస్టుపై స్పందించిన ఏథర్ కంపెనీ .. ‘సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ షెడ్యూల్ చేయడానికి ఓ ఆప్షన్ ఉంటుంది. ముందుగా మీ వాహనం గురించి తెలుసుకోండి’ అని రిప్లై ఇచ్చింది. దీనిపై యూజర్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరి, ఎలక్ట్రిక్ స్కూటర్ సాఫ్ట్‌ వేర్ అప్ డేట్ తో ఆ వ్యక్తి ఎదుర్కొన్న సమస్య పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి