iDreamPost

కొడుకుపై కోపంతో నామినేషన్‌ వేసిన 82 ఏళ్ల తల్లి!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం తీవ్ర స్థాయిలో ఉంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు తమ సమస్యలను తెలియజేసేందుకు నామినేషన్లు వేసి అందరి దృష్టిలో పడుతున్నారు.

తెలంగాణలో ఎన్నికల వాతావరణం తీవ్ర స్థాయిలో ఉంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు తమ సమస్యలను తెలియజేసేందుకు నామినేషన్లు వేసి అందరి దృష్టిలో పడుతున్నారు.

కొడుకుపై కోపంతో నామినేషన్‌ వేసిన 82 ఏళ్ల తల్లి!

ఆ వృద్ధురాలి వయస్సు 82 ఏళ్లు. ఆమె భర్త స్వాతంత్ర సమరయోధుడు.  ఆ దంపతులు కుమారుడిని కష్టపడి చదివించి.. విదేశాలకు పంపించారు. అలా విదేశాలకు వెళ్లిన కొడుకు తిరిగి  ఇంటికి వచ్చాడు. తల్లికి తెలియకుండా ఆమెకు చెందిన భూమిని అమ్మేసుకున్నాడు. దీంతో ఉన్న ఆధారం కోల్పోవడంతో ఆమె అద్దె ఇంట్లో ఉంటూ అనేక కష్టాలు పడుతుంది. న్యాయం చేయాలని ఎంతో మంది అధికారులతో పాటు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాసింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తన సమస్య పరిష్కారం అయ్యేందుకు వినూత్న మార్గాన్ని ఆ తల్లి ఎంచుకున్నారు. కొడుకుపై కోపంతో ఆ వృద్ధురాలు నామినేషన్ వేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక ఆమె ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణలో ఎన్నికల వాతావరణం తీవ్ర స్థాయిలో ఉంది. అందరి దృష్టి తెలంగాణ ఎన్నికలు, వివిధ పార్టీల అభ్యర్థులు ఎవరు అనే దానిపైనే ఉంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అనేక చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు తమ సమస్యలను తెలియజేసేందుకు నామినేషన్లు వేసి అందరి దృష్టిలో పడుతున్నారు. అలాంటి వారిలో ఒకరు కరీంనగర్ జిల్లాకు చెందిన చీటి శ్యామల అనే 82 ఏళ్ల వృద్ధురాలు

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన చీటీ మురళీధర్, చీటీ శ్యామల దంపతులు. మురళీ ధర్ స్వాతంత్రయ సమరయోధుడు. అయన కొంతకాలం క్రితం మరణించడంతో 82 ఏళ్ల శ్యామల ఒంటరిగా బతుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చీటి శ్యామల మంగళవారం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అనంతరం తాను నామినేషన్ వేయడానికి గల కారణం, తాను పడుతున్న బాధలను తెలియజేశారు. ఆమె పెద్ద కుమారుడు శ్రీరామ్‌ విదేశాలకు వెళ్లి వచ్చి.. తమకు తెలియకుండానే తన పేరిట ఉన్న స్థలాన్ని అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఆమె అద్దె ఇంట్లో ఉంటూ అష్టకష్టాలు పడుతూ.. న్యాయం చేయాలని ఏకంగా సీఎం కేసీఆర్‌కు సైతం లేఖ రాసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తే పదిమందికీ తెలిసి తన సమస్య పరిష్కారం అవుతుందని ఆ పెద్దావిడ భావించింది. తన కుమారుడిపై నిరసనగా.. తన సమస్య పరిష్కారం కావాలనే నామినేషన్‌ వేశానని ఆమె చెప్పుకొచ్చారు. ఇలా కొందరు కొడుకులు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చిత్రహింసలు పెడుతున్నారు. వారికి బతికి ఉండగానే నరకం చూపిస్తున్నారు. మరి.. కొడుకుపై కోపంతో ఈ వృద్ధురాలు నామినేషన్ వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి