iDreamPost

టాలీవుడ్ మీసం మెలేసిన అల్లు అర్జున్.. నేషనల్ బెస్ట్ యాక్టర్​గా బన్నీ!

  • Author singhj Published - 05:58 PM, Thu - 24 August 23
  • Author singhj Published - 05:58 PM, Thu - 24 August 23
టాలీవుడ్ మీసం మెలేసిన అల్లు అర్జున్.. నేషనల్ బెస్ట్ యాక్టర్​గా బన్నీ!

జాతీయ అవార్డులకు ఉండే క్రేజ్ మామూలు కాదు. సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారం అంటే నేషనల్ అవార్డ్స్ అనే చెప్పాలి. మన దేశంలో సినీ రంగంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. అయితే ఈ పురస్కారాల్లో టాలీవుడ్ ఎప్పుడూ వెనుకబడుతూ వస్తోంది. ఇప్పటిదాకా ఒక్క తెలుగు నటుడు కూడా ఉత్తమ నటుడి అవార్డును అందుకోలేకపోవడం గమనార్హం. అదే తమిళంలో మాత్రం విశ్వనటుడు కమల్ హాసన్ మూడు సార్లు, ధనుష్​ రెండు సార్లు ఈ అవార్డులను అందుకున్నారు. దివంగత నటుడు ఎంజీఆర్, చియాన్ విక్రమ్, సూర్య ఒక్కోమారు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు.

కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన కొందరు ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. మొత్తం దక్షిణాదిలో ఈ అవార్డును అందుకోని ఏకైక పరిశ్రమగా టాలీవుడ్​ను చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి అందని ద్రాక్షగా ఉన్న ఈ అవార్డును ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ గెలుచుకుంది. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్​లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. తద్వారా జాతీయస్థాయిలో తెలుగోడి మీసాన్ని మెలేశారు. ‘ఆర్ఆర్ఆర్’లో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్​ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా.. చివరకు జ్యూరీ అల్లు అర్జున్​ వైపే మొగ్గు చూపింది. 2021లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు. ‘పుష్ప’లో అద్భుతమైన నటనకు గానూ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి