iDreamPost

Nee Sneham : మర్చిపోలేని ఉదయ్ కిరణ్ ఆణిముత్యం – Nostalgia

Nee Sneham : మర్చిపోలేని ఉదయ్ కిరణ్ ఆణిముత్యం – Nostalgia

ఇప్పటి యూత్ ఉదయ్ కిరణ్ ని ఒక నిన్నటి తరం హీరోగా గుర్తిస్తారేమో కానీ ఇరవై ఏళ్ళ క్రితం తనెంత సెన్సేషనో ఆ టైంలో యువతగా ఉన్న వాళ్లకు బాగా తెలుసు. చిత్రంతో డెబ్యూ చేసి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ సంచలనానికి నువ్వు నేను రూపంలో దక్కిన బ్లాక్ బస్టర్ మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఎంఎస్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఎన్నో విజయాలు అందుకున్న నిర్మాత ఎంఎస్ రాజుకి 2001లో వెంకటేష్ దేవిపుత్రుడు భారీ నష్టాలను మిగిల్చింది. ఆ ఏడాది సంక్రాంతి కానుక విడుదలైన ఈ మూవీ కోసం కోట్ల రూపాయల డబ్బు గ్రాఫిక్స్ కోసమే ఖర్చు పెట్టడం మీడియాలో ప్రముఖంగా వచ్చింది.

దాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో బడ్జెట్ తక్కువగా ఉండే కథల కోసం చూస్తున్న తరుణంలో మనసంతా నువ్వే ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. విఎన్ ఆదిత్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎమోషన్ కం లవ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు. ఉదయ్ కిరణ్ లాంటి అప్ కమింగ్ హీరోతో తాను ఈ స్థాయి సక్సెస్ అందుకోవడం రాజుగారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ సమయంలో డెబ్యూ  దర్శకుడు పరుచూరి మురళి చెప్పిన లైన్ నచ్చడంతో దాన్ని అతనితో కలిసి స్వయంగా డెవలప్ చేసి స్క్రీన్ ప్లే రాజుగారే సమకూర్చారు. పరుచూరి బ్రదర్స్ మాటలతో స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమయ్యింది. ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు.

హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ఎంపిక కాగా ఇతర కీలక పాత్రల్లో కె విశ్వనాథ్, ధర్మవరపు, గిరిబాబు, ఆలీ, అజయ్, శివాజీరాజా, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితంలో ఓ అమ్మాయి ప్రవేశించడమనే కాన్సెప్ట్ తీసుకున్న మురళి దానికి మెలోడ్రామా కాస్త ఎక్కువగా జోడించడంతో పాటు మనసంతా నువ్వే అంచనాలను మోసుకొవడంతో నీ స్నేహం చెప్పుకోదగ్గ గొప్ప విజయం అందుకోలేకపోయింది. కానీ ఆర్పి పట్నాయక్ అద్భుతమైన పాటలకు సిరివెన్నెల సాహిత్యం తోడవ్వడంతో మ్యూజిక్ లవర్స్ నీ స్నేహం ప్రేమలో పడిపోయారు. గాయని ఉషకు చినుకుతడికి చిగురు తొడుగు పాటకు నంది అవార్డు వరించడం విశేషం

Also Read : 1999 Sankranthi Releases : అయిదుగురు హీరోల మధ్య జనవరి పోటీ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి