iDreamPost

బిగ్ బాస్ విన్నర్ పై కేసు.. ఎందుకంటే..?

టీవీలో సీరియల్స్ కన్నా బాగా అలరించే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ మాత్రమే. బిగ్ బాస్ షో వస్తుందంటే చాలు కళ్లు టీవీలకు అప్పగించేస్తూ ఉంటారు. అంతలా కనెక్ట్ అయిపోవడానికి కారణం అందులో ఉన్న కంటెస్టెంట్ చేసే హంగామా. అయితే బిగ్ బాస్ షో తో ఫేమస్ అయ్యి వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు కొందరు.

టీవీలో సీరియల్స్ కన్నా బాగా అలరించే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ మాత్రమే. బిగ్ బాస్ షో వస్తుందంటే చాలు కళ్లు టీవీలకు అప్పగించేస్తూ ఉంటారు. అంతలా కనెక్ట్ అయిపోవడానికి కారణం అందులో ఉన్న కంటెస్టెంట్ చేసే హంగామా. అయితే బిగ్ బాస్ షో తో ఫేమస్ అయ్యి వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు కొందరు.

బిగ్ బాస్ విన్నర్ పై కేసు.. ఎందుకంటే..?

టెలివిజన్ ఇండస్ట్రీలో ది బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉందంటే.. అది బిగ్ బాస్ షోనే. ఇంగ్లీష్ వర్షన్ నుండి ఇండియాకు పాకిన ఈ రియాలిటీ షోను అభిమానులు ఆదరిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, బెంగాలి, మరాఠీ, మలయాళం భాషల్లో ఈ షోను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఏ భాషల్లో రూపొందిస్తే.. ఆయా భాషల్లోని సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపి, టాస్కులు ఇచ్చి.. వారిలోని ప్రతి కదలికలను కెమెరాతో కాప్చర్ చేసి.. వీక్షకులకు అందిస్తున్నారు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ షో చాలా మంది సినీ కెరీర్ కు హెల్ప్ కూడా అయ్యింది. అయితే మరికొంత మంది బిగ్ బాస్ నటులు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన నూతన్ నాయడు.. తన ఇంట్లో పనిచేసే వ్యక్తిపై దాడికి పాల్పడటంతో అరెస్టయ్యారు. అలాగే మలయాళ బిగ్ బాస్ కంటెస్టెంట్ షియాస్ కరీమ్ కూడా అమ్మాయిని మోసం చేసిన కేసులో జైలు పాలయ్యాడు. మొన్నటికి మొన్న కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లో సంతోష్ అనే కంటెస్టెంట్.. మెడలో పులి గోరు లాకెట్ ధరించడంతో అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సారి బిగ్ బాస్ విన్నరే ఓ వివాదంలో ఇరుకున్నాడు. బాలీవుడ్ బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్ పై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు ఓటీటీ బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్. ఓ రేవ్ పార్టీలో పాము విషాన్ని వాడారన్న ఆరోపణలపై అతడిపై కేసు నమోదైంది.

నోయిడాలోని సెవ్రాన్ బాంక్వెట్ హాల్‌లో జరిగిన రేవ్ పార్టీలో మత్తు కోసం పాము విషాన్ని వాడినట్లు తెలుస్తోంది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దాడులు చేపట్టగా.. ఐదు నాగు పాముల్ని, విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు నాగుపాములు, రెండు శాండ్ బోస్, కొండ చిలువ ఉన్నాయని, ఇవన్నీ కూడా అంతరించిపోతున్న జీవుల కేటగిరిలో ఉన్నాయని ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడే ఎల్విష్ పేరు వినిపించింది. వన్య ప్రాణుల రక్షణ చట్టం కింద అతడిపై అభియోగాలు నమోదు చేశారు. అయితే యూట్యబూర్ అయిన ఎల్విష్ పరారీలో ఉన్నారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ అభియోగాలు రుజువైతే నాన్ బెయిలబుల్ వారెంట్‌తో పాటు ఏడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అయితే తనను కావాలని ఇరికించారంటూ ఎల్విష్ ఓ వీడియోను విడుదల చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి