• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » movies » 5 Reasons Why Shah Rukh Khans Pathaan Is A Huge Blockbuster

పఠాన్ విజయానికి 5 కారణాలు

  • By idream media Published Date - 03:17 PM, Mon - 30 January 23 IST
పఠాన్ విజయానికి 5 కారణాలు

నాలుగేళ్ల తర్వాత తెరమీద కనిపించిన షారుఖ్ ఖాన్ కు అంత నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కేసింది. పఠాన్ దూకుడు దేశంతో సంబంధం లేకుండా భీభత్సంగా సాగుతోంది. ఓవర్సీస్ లో కేవలం అయిదు రోజులకే 10 మిలియన్ మార్కుకి దగ్గరగా వెళ్లిపోవడం ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ మూవీకి సాధ్యపడలేదు. ఇటు వరల్డ్ వైడ్ గ్రాస్ సైతం 550 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ లెక్కలు కడుతోంది. ఖచ్చితమైన ఫిగర్లు ఇంకా బయటికి రానప్పటికీ కొంచెం అటుఇటుగా ఇవి రీచ్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ సహజమే అయినా ఏ సెంటర్లలో ఆక్యుపెన్సీలు చాలా బాగున్నాయి. దగ్గరలో కొత్త రిలీజులు లేవు కాబట్టి ఈ దూకుడు ఇప్పట్లో ఆగదు

ఇక పఠాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన అయిదు అంశాలేంటో చూద్దాం. మొదటిది షారుఖ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఎంతసేపూ ఏదో రొమాంటిక్ గా కనిపించాలన్న తాపత్రయంలో గత పదేళ్లలో అతను చేసిన కథల ఎంపిక చేదు ఫలితాలను ఇచ్చింది. ఒక్క రయీస్ దానికి మినహాయింపు అయినా టేకింగ్ లోపాల వల్ల అదీ పెద్ద స్థాయికి చేరలేదు. రెండోది యాక్షన్ గ్రాండియర్ నెస్. ఏ మాత్రం నమ్మలేని విధంగా ఉండే ఫైట్లను దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కంపోజ్ చేయించుకున్న తీరు పఠాన్ స్థాయిని పెంచింది. మూడోది జాన్ అబ్రహం విలనీ. ఎప్పుడో ధూమ్ లో చూసిన విలనిజం మళ్ళీ ఇందులో పర్ఫెక్ట్ గా పండించి చాలా పెద్ద ప్లస్ అయ్యాడు.

నాలుగోది అవసరం లేకుండా పాటలు పెట్టకపోవడం. ఎంత స్కోప్ ఉన్నా ఫ్లోకి అడ్డం వస్తాయని భావించిన సిద్దార్థ్ ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ కే పరిమితం చేయడం రెండోది ఎండ్ టైటిల్స్ కి కుదించడం బాగుంది. బోర్ తగ్గిపోయింది. అయిదోది సల్మాన్ ఖాన్ క్యామియో. ఉన్నది కాసేపే అయినా తన ఉనికిని బలంగా చాటుకునేలా తన టైమింగ్ తో ఫ్యాన్స్ కి మంచి విందు అందించాడు. ఇవన్నీ ఇలా బ్యాలన్స్ కాబట్టి కథతో పాటు కంటెంట్ ఎంత వీక్ గా ఉన్నా అన్నీ చెల్లిపోయాయి. ముఖ్యంగా మూడేళ్లుగా వందల కోట్లు తెచ్చే ఒక పెద్ద హీరో బ్లాక్ బస్టర్ లేని కరువుని ఎలాగైనా పఠాన్ రూపంలో తీర్చుకోవాలని కంకణం కట్టుకున్న ప్రేక్షకులు పఠాన్ ని ఎత్తులో నిలబెట్టేశారు.

Tags  

  • Deepika Padukone
  • Pathaan
  • pathaan collections
  • Shah Rukh Khan

Related News

ఇది సలార్ vs డుంకి కాదు.. ప్రశాంత్ నీల్ vs షారుఖ్ ఖాన్!

ఇది సలార్ vs డుంకి కాదు.. ప్రశాంత్ నీల్ vs షారుఖ్ ఖాన్!

సాధారణంగా సినిమా రిలీజ్ ల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అందులోనూ పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ అంటే.. అసలు ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోతాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెండు బిగ్గెస్ట్ మూవీస్ మధ్య క్లాష్ గురించి ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఒకటి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్. రెండోది కింగ్ షారుఖ్ ఖాన్ – రాజ్ కుమార్ హిరాని […]

16 hours ago
షారుఖ్ నయా రికార్డు! ఇప్పట్లో ఏ హీరో బ్రేక్ చేయలేడేమో!

షారుఖ్ నయా రికార్డు! ఇప్పట్లో ఏ హీరో బ్రేక్ చేయలేడేమో!

5 days ago
సలార్ vs డుంకి.. ఇది కదా అసలు బాక్సాఫీస్ వార్ అంటే..

సలార్ vs డుంకి.. ఇది కదా అసలు బాక్సాఫీస్ వార్ అంటే..

5 days ago
ఫ్యాన్ గా నయన్ చేయలేనిది! ఫ్రెండ్ గా దీపికా చేసింది!

ఫ్యాన్ గా నయన్ చేయలేనిది! ఫ్రెండ్ గా దీపికా చేసింది!

2 weeks ago
VIDEO: షారుక్ పాటకు బెడ్​పై నుంచి లేచి డ్యాన్స్ చేసిన పేషెంట్!

VIDEO: షారుక్ పాటకు బెడ్​పై నుంచి లేచి డ్యాన్స్ చేసిన పేషెంట్!

2 weeks ago

తాజా వార్తలు

  • రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?
    6 hours ago
  • లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!
    7 hours ago
  • వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు
    9 hours ago
  • దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..
    10 hours ago
  • RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!
    10 hours ago
  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    10 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    10 hours ago

సంఘటనలు వార్తలు

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    11 hours ago
  • ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!
    11 hours ago
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!
    12 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    12 hours ago
  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    12 hours ago
  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    12 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    13 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version