iDreamPost

RCBకి పట్టిన దరిద్రం ఈ ముగ్గురే! వీళ్లను తీసేస్తే కానీ గెలవలేరు..

  • Published Apr 03, 2024 | 12:00 PMUpdated Apr 03, 2024 | 12:02 PM

RCB vs KKR, IPL 2024: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ ఘోర ఓటమి తర్వాత.. టీమ్‌లో ఉన్న ఓ ముగ్గురు చెత్త ప్లేయర్లను తీసేయాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఆ ముగ్గరు ఎవరో ఇప్పుడు చూద్దాం..

RCB vs KKR, IPL 2024: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ ఘోర ఓటమి తర్వాత.. టీమ్‌లో ఉన్న ఓ ముగ్గురు చెత్త ప్లేయర్లను తీసేయాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఆ ముగ్గరు ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 03, 2024 | 12:00 PMUpdated Apr 03, 2024 | 12:02 PM
RCBకి పట్టిన దరిద్రం ఈ ముగ్గురే! వీళ్లను తీసేస్తే కానీ గెలవలేరు..

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మూడో ఓటమిని మూటగట్టుకుంది.  మంగళవార హోం గ్రాండ్స్‌లో చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది. అంతకు ముందు శుక్రవారం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమిపాలైంది. కేకేఆర్‌పై విరాట్‌ కోహ్లీ 83 పరుగులు చేసి రాణించినా.. మిగతా బ్యాటర్ల నుంచి కావాల్సినంత సపోర్ట్‌ లేకపోవడంతో ఆర్సీబీ ఓ మోస్తారు స్కోర్‌కే పరిమితం అయింది. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, రజత్‌ పాటిదార్‌, అనుజ్‌ రావత్‌ అయితే సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితం అయ్యారు. కామెరున్‌ గ్రీన్‌ 33, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 28 పరుగులు చేసినా.. అది వారి స్థాయి ఆట కాదు, మ్యాచ్‌ గెలవడానికి సరిపోలేదు. కోహ్లీ ఒంటరి పోరాటంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసిన ఆర్సీబీ బౌలింగ్‌ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.

184 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌.. కేవలం 16.5 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను ఊదిపారేసింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌, సునీల్‌ నరైన్‌ ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఒక రకంగా విధ్వంసం సృష్టించారు. వారి బాదుడికి కేవలం పవర్‌ ప్లేలోనే ఏకంగా 80కి పైగా పరుగులు వచ్చాయి. మొత్తంగా సాల్ట్‌ 30, నరైన్‌ 47, వెంకటేశ్‌ అయ్యర్‌ 50, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 39 పరుగులతో రాణించి కేకేఆర్‌కు ఈజీ విక్టరీ అందించారు. ఈ ఓటమితో ఆర్సీబీ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆర్సీబీలో పస లేదని, ఒక్క కోహ్లీనే ఎన్ని సార్లు ఆడతాడని మండిపడుతున్నారు. ముఖ్యంగా టీమ్‌లో ఓ ముగ్గురు ప్లేయర్లు దండగా అంటున్నారు. ఆ ముగ్గురిని తీసేసి.. వేరే ప్లేయర్లను తీసుకోవాలని అంటున్నారు.

ముఖ్యంగా యువ క్రికెటర్‌ రజత్‌ పాటిదార్‌ను పొట్టుపొట్టు తిడుతున్నారు. ఐపీఎల్‌ కంటే ముందు ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడిన పాటిదార్‌ దారుణంగా విఫలం అయ్యాడు. అదే బ్యాడ్‌ ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నాడు. అతని ప్లేస్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ను తీసుకున్న బాగుండేది అంటున్నారు. ఇక ఆర్సీబీ బౌలింగ్‌ అయితే మరీ చెత్తగా ఉంది. మెయిన్‌ బౌలర్‌ సిరాజ్‌ దారుణంగా విఫలం అవుతున్నాడు. కొంత కాలంగా సరైన లయలో లేని సిరాజ్‌.. తిరిగి తన ఫామ్‌ను అందుకోకుంటే.. ఆర్సీబీకి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇక ప్రస్తుతం ఆర్సీబీ టీమ్‌లో ఉన్న అ‍త్యంత చెత్త ప్లేయర్‌గా అల్జారీ జోసెఫ్‌ను ఆర్సీబీ అభిమానులు భావిస్తున్నారు. లక్నోతో మ్యాచ్‌లో అతని స్థానంలో టోప్లీని తీసుకున్నా.. అతను కూడా జోసెఫ్‌లానే బౌలింగ్‌  చేశాడు. దారుణంగా విఫలం అయ్యాడు.

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో జోసెఫ్‌ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన అతను ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు. అతన్ని ఎందుకు ఆడిస్తున్నారో తమకు అర్థం కావడం లేదంటూ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. అతని ప్లేస్‌లో టోప్లీని ఆడిస్తే.. అతను లక్నోపై 4 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుని.. విఫలం అయ్యాడు. వీరితో పాటు పాటు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ కూడా ఫామ్‌లో లేరు. ప్రస్తుతం ఆర్సీబీ టీమ్‌లో విరాట్‌ కోహ్లీ, డినేష్‌ కార్తీక్‌ తప్పితే.. ఎవరూ కూడా టీమ్‌కు న్యాయం చేయలేకపోతున్నారు. కానీ, వారికి ప్రత్యామ్నయం లేదు కాబట్టి.. అల్జారీ జోసెఫ్‌, రజత్‌ పాటిదార్‌లను పూర్తిగా పక్కనపెట్టి వేరే ఆటగాళ్లను టీమ్‌లోకి తీసుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. సిరాజ్‌కు కాస్త రెస్ట్‌ ఇచ్చి మళ్లీ బరిలోకి దింపితే ఏమైనా ఛేంజ్‌ ఉంటుందని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి