iDreamPost

బయటపడ్డ ఐ.టి రిపోర్టు – పూర్తిగా ఇరుకున్న తెలుగుదేశం

బయటపడ్డ ఐ.టి రిపోర్టు – పూర్తిగా ఇరుకున్న తెలుగుదేశం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు దగ్గర సుదీర్ఘ కాలం వివిద హోదాల్లో పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ తో పాటు , నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ , అలాగే తెలుగుదేశం కీలక నేత రెడ్డప్ప గారి శ్రీనివాసుల రెడ్డి మీద జరిగిన ఐ.టి దాడుల్లో 2వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఐ.టి శాఖ తమ నివేదికను బయట పెట్టడంతో రాష్ట్రం ఒక్క సారిగా ఉల్లిక్కి పడింది. ఈ అంశాన్ని అందుకొని వైసీపీ ఆరోపణలతో రాజకీయాన్ని వేడెక్కించగా పలు రకాల వివరణలతో టీడీపీ సమాధానం ఇచ్చుకోవడంలో తలమునకలయ్యింది . అయితే ఇప్పటికే అనేక వివాదాలతో సతమతమౌతున్న తెలుగుదేశం మెడకు మరొక ఉచ్చు బిగుసుకోవటంతో తెలుగుదేశం నేతలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తొలుత పెండ్యాల శ్రీనివాస్ తో మాకు సంభందం లేదు అని ప్రకటించి ప్రజల్లో చులకన అవ్వటంతో మరొక ఎత్తు వేశారు .

నష్ట నివారణ చర్యలో బాగంగా వర్ల రామయ్య , అచ్చం నాయుడు లాంటి సీనియర్ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించి జరిగిన ఐ.టి దాడుల్లో ఏమీ లేకపోయినా అధికార పార్టీ బురద జల్లుతుందని ప్రచారం మొదలు పెట్టారు దీనికి సాక్ష్యంగా ఒక డాక్యుమెంటును సైతం చూపారు.

అయితే తాజాగా ఆదాయపు పన్ను శాఖ శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఆర్.కే ఇన్ ఫ్రాలో సోదాలకు సంబంధించి 13 పేజీల పంచనామా రిపోర్టు బయటపడింది . దీంతో తెలుగుదేశం నేతల ప్రచారానికి బ్రేక్ పడేలా మరిన్ని విస్తుపోయే వాస్థవాలు వెలుగులోకి వచ్చాయి . ఈ రిపోర్టు ప్రకారం ఒక్క ఈ కంపెనీలోనే 1000 పేజీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు వీటితో పాటు సీజ్ చేసిన బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్టు ఈ పంచనామా రిపోర్టులో బయటపడింది . అలాగే చంద్రబాబు మాజీ పి.యస్ శ్రీనివాస్ ఇంట్లో చేసిన సోదాల్లో కూడా వేల పేజీల డాక్యుమెంట్లను స్వాదీనం చేసుకున్నట్టు బయటపడింది. ఈ డాక్యుమెంటులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ప్రతి డాక్యుమెంటులో కూడా వేల కోట్ల రూపాయల లావాదేవీల వ్యవహారం ఉందని ,

ఒక్కో డాక్యుమెంటు ద్వారా వేల కోట్ల అవినీతిని నిరూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో గత రెండు రోజులగా తెలుగుదేశం నేతలు శ్రీనివాస్ ఇంట్లో జరిగిన సోదాల్లో కేవలం రెండు లక్షల అరవై మూడు వేలు మాత్రమే దొరికాయని అవి కూడా లెక్క చూపే సరికి విడిచిపెట్టారని దీనికి సాక్షంగా టీడీపీ ప్రచారంలో పెట్టిన పేజీ , ఇతర వార్తలు అన్నీ బోగస్ అని తేలింది, నేడు బహిర్గతం అయిన ఈ పంచనామా రిపోర్టుతో తెలుగుదేశం నేతల బండారం బయట పడింది . ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించటానికి ఆ డాక్యుమెంట్లలో ఒక పేజీ మాత్రమే తెలుగుదేశం నేతలు లీక్ చేసి నేరాన్ని పలచన చేసే కుట్రకు తెరలేపారనే వాదనకి మరింత బలం చేకూరింది. అధికార పార్టీ మాత్రం ఆదాయపు పన్ను శాఖ తయారు చేసిన పూర్తి రిపోర్టును చూపిస్తూ తెలుగుదేశం నేతలను చర్చకు రమ్మని సవాల్ విసురుతున్నారు.

రిపోర్టులోని ఒక పేపర్ మాత్రమే లీక్ చేసి ఐటీ దాడులలో దొరికింది రెండు వేల కోట్లు కాదు కేవలం రెండు లక్షల ముప్పై వేలే అని అక్రమ లావాదేవీల కేసును పలచన చేద్దాం అని చూసిన తెలుగుదేశం నేతలు అధికార పార్టీ నుండి వచ్చిన ఈ సవాల్ తో డిఫెన్స్ లో పడ్డారనే చెప్పాలి. అడ్డంగా దొరికిన ఈ వ్యవహారంలో అడ్డగోలుగా వాదించటం బస్మాసుర హస్తం లాంటిపని అని కొందరు తెలుగుదేశం నేతల ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడుతున్న మాట . తెలుగుదేశం మెడకు చుట్టుకున్న ఈ 2వేల కోట్ల తాడు ఇంకెంత బిగుసుకుంటుందో చూడాలి.

తన పై ఏ ఆరోపణ వచ్చిన తక్షణమే స్పందించి నేను నిప్పుని ఇవన్నీ కుట్రలు అని ఆగ్రహంగా స్పందించే బాబు గారు ఈ సోదాల తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవటమే కాక కనీసం ఫోన్ , మెయిల్స్ కూడా స్పందించట్లేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి . గత రెండు నెలలుగా అనునిత్యం అమరావతి రాజధాని ఉద్యమం గురించే మాట్లాడుతున్న బాబు గారు ఈ ఘటన తర్వాత అమరావతి పరిసర ప్రాంతాల్లో సైతం కనిపించకుండా హైదరాబాద్ లోనే మకాం వేయడం విశేషం .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి