iDreamPost

Tamil Dubbed Movie Domination: విషయమున్న అనువాదాలకే బ్రహ్మరథం

ఆ నెల ముందుగా వచ్చిన సినిమా 5న రిలీజైన ప్రభుదేవా 'లవ్ బర్డ్స్'. ప్రేమికుడు వల్ల వచ్చిన ఇమేజ్ కి బిజినెస్ బాగా జరిగింది. ఏఆర్ రెహమాన్ పాటలు బాగున్నప్పటికీ కంటెంట్ వీక్ కావడంతో ఆశించిన ఫలితం దక్కలేదు. ఫలితం డిజాస్టర్.

ఆ నెల ముందుగా వచ్చిన సినిమా 5న రిలీజైన ప్రభుదేవా 'లవ్ బర్డ్స్'. ప్రేమికుడు వల్ల వచ్చిన ఇమేజ్ కి బిజినెస్ బాగా జరిగింది. ఏఆర్ రెహమాన్ పాటలు బాగున్నప్పటికీ కంటెంట్ వీక్ కావడంతో ఆశించిన ఫలితం దక్కలేదు. ఫలితం డిజాస్టర్.

Tamil Dubbed Movie Domination: విషయమున్న అనువాదాలకే బ్రహ్మరథం

అప్పుడప్పుడు టైం మెషీన్ లో ప్రయాణం చేసి వెనక్కు వెళ్తే ఎన్నో ఆసక్తికరమైన సంగతులు తెలుస్తాయి. ఓసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 1996 ఏప్రిల్ లో విడుదలైన సినిమాల ముచ్చట్లు చూద్దాం. ఆ నెల ముందుగా వచ్చిన సినిమా 5న రిలీజైన ప్రభుదేవా ‘లవ్ బర్డ్స్’. ప్రేమికుడు వల్ల వచ్చిన ఇమేజ్ కి బిజినెస్ బాగా జరిగింది. ఏఆర్ రెహమాన్ పాటలు బాగున్నప్పటికీ కంటెంట్ వీక్ కావడంతో ఆశించిన ఫలితం దక్కలేదు. ఫలితం డిజాస్టర్. అదే రోజు వచ్చిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే తెలుగు డబ్బింగ్ ‘ప్రేమించి పెళ్లాడుతా’ ఇక్కడా రికార్డు బ్రేకు కలెక్షన్లతో వీర విహారం చేసింది. చాలా కేంద్రాల్లో వంద రోజులకు ప్రదర్శితమైన ఒరిజినల్ కు ధీటుగా ఆడింది.

వీటితో పాటు సీరియస్ సబ్జెక్టుతో పలకరించిన జగపతిబాబు ‘శ్రీకారం’ని ప్రేక్షకులు తిరస్కరించారు. 12న కోడి రామకృష్ణ దర్శకత్వంలో జగపతిబాబు ప్రేమ కాంబినేషన్ లో తీసిన ‘మా ఆవిడ కలెక్టర్’ ఫ్యామిలీ ఆడియన్స్ అండతో హిట్ అనిపించుకుంది. జెడి చక్రవర్తి ‘మృగం’ని జనం మెచ్చలేదు. అంత సీరియస్ నెస్ ని థియేటర్ లో భరించలేదు. సాంగ్స్ క్లిక్ అయ్యాయి. 19న ఆర్ నారాయణమూర్తి ‘అరణ్యం’ మంచి రేట్ కు అమ్ముడుపోయింది. రవిరాజా పినిశెట్టి మొదటిసారి విప్లవ సినిమాకు డైరెక్షన్ చేశారు. కానీ రిజల్ట్ యావరేజ్ కు అటుఇటుగా నిలిచిపోయింది. భారీ బడ్జెట్ తో తీసిన ‘వార్నింగ్’ని ఎవరూ పట్టించుకోలేదు. జయప్రద ఇమేజ్ పని చేయలేదు.

25న వచ్చిన రజినీకాంత్ ‘ముత్తు’ వసూళ్ల వర్షం కురిపించింది. బాషా తర్వాత దాని రేంజ్ లో ఆడిన సూపర్ స్టార్ బొమ్మ ఇదే. కేఎస్ రవికుమార్ దర్శకత్వం, రెహమాన్ పాటలు అదరగొట్టాయి. అదే రోజు నాగార్జున కృష్ణ సౌందర్య సుహాసిని లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో రూపొందిన ‘రాముడొచ్చాడు’కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఒక రోజు తేడాతో అర్జున్ ‘ఎర్రకోట’ కమర్షియల్ గా పాస్ అనిపించుకుంది. ఇవి కాకుండా ఆ నెలలో వచ్సిన డబ్డ్ మూవీస్ ఉగ్రనేత్రుడు(సుమన్ ది కాదు), లేడీ ఆఫీసర్ బిసి సెంటర్స్ లో ఓకే అనిపించుకున్నాయి. ఫైనల్ గా టాప్ వన్ టూ త్రిలో ప్రేమించి పెళ్లాడుతా, ముత్తు, మా ఆవిడ కలెక్టర్ లు నిలిచాయి.

Also Read : Addhala Meda : దర్శకరత్న హాఫ్ సెంచరీ మైలురాయి – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి