iDreamPost

బ్యాంకులో చోరీకి యత్నించిన 13ఏళ్ల బాలుడు! గడ పారతో తాళం పగలగొట్టి..

బ్యాంకులో చోరీకి యత్నించిన 13ఏళ్ల బాలుడు! గడ పారతో తాళం పగలగొట్టి..

నేటికాలంలో అక్రమ సంపాదనకు, అడ్డదారుల్లో సంపాదించాలనే మనుషులు బాగా పెరిగి పోయారు. కాయ కష్టం చేసుకుని వాడి నుంచి దొంగతనం, అవినీతి రూపంలో చోరీ చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది దొంగతనాలకు పాల్పడి.. సొమ్మును కాజేస్తున్నారు. ఈ దొంగతనాలు చేసే వారిలో మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. అయితే ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో ఎస్బీఐ బ్యాంకులో జరిగిన చోరీ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వీళ్లు కూడా  చోరీలు చేస్తారా? అనే సందేహం వచ్చింది. పుస్తకం చేత పట్టాల్సిన 13 ఏళ్ల బాలుడు గడ్డపార చేత పట్టి.. చోరీకి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్‌లో బుధవారం రాత్రి దొంగలు చోరీకి  యత్నించారు. గురువారం ఉదయం బ్యాంకును పరిశీలించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంక్‌లోని సీసీ కెమెరాలను పరీక్షించగా దొంగతనానికి వచ్చిన వ్యక్తిని చూసి షాకయ్యారు. సీసీ టీవీ పుటేజ్ లో కనిపించిన నిందితుడు ఏడో తరగతి విద్యార్థి.  సరిగ్గా 13 ఏళ్లుగా పూర్తిగా నిండని ఆ బాలుడు నిత్యం జనసంచారంతో రద్దీగా ఉన్న సమయంలో బ్యాంకులోకి రాత్రి 8.20 గంటలకు ప్రవేశించాడు. బాలుడు ఒంటరిగా బ్యాంకులోకి  ప్రవేశించడంపై పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

బాలుడికి ఎవరైన ట్రైనింగ్ ఇవ్వడంతో చోరీకి దిగాడా? లేక స్వతహాగానే వచ్చాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీసీపుటేజిలో కనిపించిన దృశ్యల ప్రకారం.. బయ్యారం మండలం ఇర్సులాపురానికి చెందిన 13 ఏళ్ల బాలుడు ఎస్‌బీఐ బ్యాంకులోకి గడ్డపారతో ప్రవేశించాడు. గ్రిల్స్‌ తలుపుల తాళం పగులకొట్టి.. బ్యాంకులోకి ప్రవేశించాడు. బ్యాంకులో ఉండే డెస్క్‌లలో డబ్బులు, నగలు ఉంటాయేమోనని గంటపాటు తీవ్రంగా వెతికాడు. చివరకు అక్కడ ఏమి దొరక్క పోవడంతో అక్కడి నుంచి ఆ బాలుడు వెనుతిరిగినట్లు సీసీటీవీ కెమెరాలో నమోదైంది.

ఈ విషయాన్ని గురువారం ఉదయం బ్యాంకులో స్వీపర్ గా పని చేసే పద్మ అనే మహిళ గమనించింది. బ్యాంకు తాళం పగలగొట్టి ఉండడాన్ని చూసి వెంటనే పై అధికారులకు సమాచారం అందించింది. బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుస్తకం పట్టాల్సిన పిల్లలు..గడ్డ పారలు పట్టి.. ఇలా చోరీకి వెళ్లడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దల కారణంగానే పిల్లలు అలా తయారు అవుతారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి..13 ఏళ్ల బాలుడు చోరీకి యత్నించడంపై తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో..కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి