iDreamPost

చనిపోయాక కల నేరవేర్చుకుంటున్న బాలుడు!

ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యం అనేది ఉంటుంది. అలా లేని వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అందరూ బతికుండగానే లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఓ బాలుడు మాత్రం చనిపోయిన తరువాత తన కలను నేరవేర్చుకున్నాడు.

ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యం అనేది ఉంటుంది. అలా లేని వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అందరూ బతికుండగానే లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఓ బాలుడు మాత్రం చనిపోయిన తరువాత తన కలను నేరవేర్చుకున్నాడు.

చనిపోయాక కల నేరవేర్చుకుంటున్న బాలుడు!

ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. జీవితంలో ఏదైన సాధించాలనే ఆశ, కోరిక  ఉంటుంది. ఆ లక్ష్యాల కోసం కొందరు ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు మాత్రం కేవలం కలలు మాత్రం కంటుంటారు. అయితే కొందరు తమ లక్ష్యాన్ని సాధించే వేటలో.. ఎన్నో అవరోధారు ఎదుర్కొంటారు.  చివరకు తమ కలను సాధించుకుంటారు. కానీ బాలుడు మాత్రం చనిపోయాక  తన ఆశయాన్ని నిరవేర్చుకున్నాడు. మరి… ఆ బాలుడి కల ఏమిటి? అది ఎలా నిరవేరింది? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో గాజా పట్టణంపై  ఇజ్రాయిల్ సైన్యం తీవ్రంగా విరుచుకపడుతుంది. ఇక ఈ వార్ లో  వేలాది మంది మరణించారు. అలానే గాజాలో ఉంటున్న పాలస్తీనా చిన్నారి అవ్ని(12) కూడా ఇజ్రాయిల్ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే అవ్నికి చిన్నప్పటి నుంచి ఓ కళ ఉండేది.  ఎప్పటికేనా  సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనేది అవ్ని కోరిక. అంతేకాక తాను ఓ ఛానెల్ పెట్టి..దానికి ఒక మిలియన్ సబ్ స్కైబర్లు వచ్చేలా చేయాలని నిర్ణయించుకున్నాడు.

small boy dream

ఈ క్రమంలోనే తరచూ వీడియోలు చేస్తూ.. సబ్ స్కైబర్లను పెంచుకునే పనిలో పడ్డాడు. ఇదే సమయంలో గాజాపై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన దాడుల్లోఅవ్ని(12)గా ప్రాణాలు కోల్పోయాడు. యూట్యూబర్ గా రాణించాలని అతడి కల కలగానే మిగిలి పోతుందని కుటుంబ సభ్యులు భావించారు. ఇక అతడు చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఓ వీడియో చేశాడు. అందులో తను మాట్లాడుతూ..” నా ఛానెల్ కు ఒక మిలియన్ సబ్ స్కైబర్లు కావాలి. అదే నా లక్ష్యం” అని అవ్న తెలిపారు.  అవ్ని వీడియో నెటిజన్ల మనస్సు కలచి వేసింది. దీంతో అతడి కలను నేరవేర్చేందుకు నడుం కట్టారు.

దాని ఫలితంగా ఇప్పుడు  15 లక్షల  మంది సబ్ స్రైబర్లు వచ్చారు. 10 వీడియోలే ఉన్నా లక్షల్లో లైక్స్ వేలల్లో కామెంట్స్ ఉన్నాయి. దీంతో అతడి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ కలను నేరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.  ఎంతో మంది అవరోధాలను ఎదుర్కొన్ని విజయతీరాలకు చేరారు. మరికొందరు మధ్యలో విధి వక్రీకరించి.. ప్రమాదాలు జరిగిన.. వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగారు. ఈ బాలుడి విషయంలో మాత్రం.. నెటిజన్లు అతడికి విజయాన్ని సాధించి పెట్టారు. మరి..  ఈచిన్నారి ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి