iDreamPost

Agni Chopra: చరిత్ర సృష్టించిన ‘12th ఫెయిల్’ డైరెక్టర్ కొడుకు.. వరల్డ్ క్రికెట్​లో ఒకే ఒక్కడు!

  • Published Feb 01, 2024 | 11:43 AMUpdated Feb 01, 2024 | 11:43 AM

‘12th ఫెయిల్’ సినిమాతో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టారు డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. అలాంటి ఆయన కొడుకు వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

‘12th ఫెయిల్’ సినిమాతో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టారు డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. అలాంటి ఆయన కొడుకు వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 01, 2024 | 11:43 AMUpdated Feb 01, 2024 | 11:43 AM
Agni Chopra: చరిత్ర సృష్టించిన ‘12th ఫెయిల్’ డైరెక్టర్ కొడుకు.. వరల్డ్ క్రికెట్​లో ఒకే ఒక్కడు!

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది కొన్ని వందల సినిమాలు వస్తుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే హిట్టవుతాయి. అందులోనూ ఒకట్రెండు మూవీసే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఒక చిత్రమే ‘12th ఫెయిల్’. ప్రముఖ దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా ఓ బయోపిక్. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ స్టోరీ ఆధారంగా తీసిన ‘12th ఫెయిల్’ గతేడాది అక్టోబర్​లో విడుదలై బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఓటీటీల్లోకి వచ్చాక పలు భాషల్లో డబ్బింగ్ రూపంలోనూ చాలా మంది ఆడియెన్స్​కు దగ్గరైంది. ఇంటర్​లో ఫెయిలైనా సివిల్స్ వైపు ఓ యువకుడి పయనం ఎలా సాగిందనే కథతో తెరకెక్కిన ఈ సినిమా చాలా మందిని కదిలించింది. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ, తీసుకురావాల్సిన మార్పుల గురించి ధైర్యంగా ఇందులో డిస్కస్ చేశారు. ఈ ఫిల్మ్​తో టాక్ ఆఫ్​ ది టౌన్​గా మారారు డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. సూపర్ సినిమా తీశారని పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన కొడుకు అగ్ని చోప్రా క్రికెట్​లో చరిత్ర సృష్టించాడు.

‘12th ఫెయిల్’ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా కొడుకు అగ్ని చోప్రా క్రికెట్​లో ఎవరికీ సాధ్యం కాని ఓ రేర్​ ఫీట్​ను అందుకున్నాడు. రంజీ ట్రోఫీ-2024లో మిజోరాం తరఫున ఆడుతున్న అగ్ని చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో తన తొలి నాలుగు మ్యాచుల్లో 4 సెంచరీలు చేసిన మొదటి క్రికెటర్​గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. రంజీ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ శతకాలు బాదిన చోప్రా.. ఈ అరుదైన ఘనతను తన పేరు మీద రాసుకున్నాడు. ఈ ఏడాది రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చిన చోప్రా.. సిక్కింతో ఆడిన తొలి మ్యాచ్​లోనే సెంచరీతో మెరిశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో 166 పరుగులు చేసిన ‘12th ఫెయిల్’ డైరెక్టర్ కొడుకు.. రెండో ఇన్నింగ్స్​లో 92 పరుగులు సాధించాడు. ఆ తర్వాత నాగాలాండ్, అరుణాచల్​ ప్రదేశ్​తో జరిగిన మ్యాచుల్లోనూ సెంచరీలతో కదం తొక్కాడు.

The son of the director of '12th Fail' who made history!

ఓవరాల్​గా ఈ రంజీ సీజన్​లో తాను ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ సెంచరీలతో మెరిశాడు అగ్ని చోప్రా. నాలుగు మ్యాచుల్లోనే అగ్ని ఐదు సెంచరీలు బాదడం గమనార్హం. తన కొడుకు సాధించిన ఈ అరుదైన ఘనతపై అగ్ని చోప్రా తల్లి, ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమా చోప్రా హర్షం వ్యక్తం చేశారు. తల్లిగా తాను ఎంతో గర్విస్తున్నానని ఆమె ట్విట్టర్​లో ఓ పోస్ట్ పెట్టారు. ఇక, రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలతో అగ్ని చోప్రా పేరు మార్మోగుతోంది. ఇదే జోరును అతడు ఈ సీజన్ మొత్తం కంటిన్యూ చేస్తే త్వరలో టీమిండియాకు ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అయితే రంజీల్లో పెద్ద జట్ల మీద కూడా అతడు ఇదే విధంగా పెర్ఫార్మ్ చేయాలని చెబుతున్నారు. బిగ్ టీమ్స్​పై బిగ్ నాక్స్ ఆడితే అతడికి తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ‘12th ఫెయిల్’ డైరెక్టర్ కొడుకు భారత్​కు ఆడితే చూడాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి