iDreamPost

షాక్ ఇస్తున్న కాంతార కలెక్షన్లు

షాక్ ఇస్తున్న కాంతార కలెక్షన్లు

అసలేం పెద్దగా అంచనాలు లేకుండా ఒక డబ్బింగ్ సినిమాగా వచ్చిన కాంతార తెలుగునాట సంచలనాలు రేపుతోంది. శనివారం రిలీజ్ అయినప్పటికీ వీక్ డేస్ లోనూ డ్రాప్ లేకుండా జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. కన్నడ నేటివిటీకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ కావడంతో తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోరేమోనన్న అనుమానంతో హోంబాలే సంస్థ కేవలం 2 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తోడవ్వడంతో మంచి రిలీజ్ దక్కింది. కట్ చేస్తే కేవలం నాలుగు రోజులకే 8 కోట్ల 25 లక్షల దాకా షేర్ రాబట్టి వామ్మో అనిపిస్తోంది. గ్రాస్ ప్రకారం చూసుకుంటే ఇది 16 కోట్ల దాకా తేలుతుంది. అంటే నాలుగింతల రాబడి వచ్చిందన్న మాట.

ఇక ఏరియాల వారిగా చూసుకుంటే నైజామ్ 3 కోట్ల 60 లక్షలు, సీడెడ్ 1 కోటి 10 లక్షలు, ఉత్తరాంధ్ర 1 కోటి 4 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 1 కోటి 14 లక్షలు, గుంటూరు 54 లక్షలు, కృష్ణా 48 లక్షలు, నెల్లూరు 35 లక్షల దాకా రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం పెట్టుకున్న లక్ష్యం కేవలం 2 కోట్ల 30 లక్షలు మాత్రమే. దీన్ని బట్టి ఎంత లాభం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అలా అని కాంతార ఫైనల్ రన్ కు దగ్గరగా లేదు. కనీసం ఇంకో వారం పది రోజులు ఇదే స్ట్రాంగ్ రన్ ని కొనసాగించనుంది. దీపావళికి ఎన్ని కొత్త సినిమాలు వస్తున్నా సరే కాంతార మాత్రం తగ్గేదేలే అనేలా కనిపిస్తోంది. బీసీ సెంటర్లలో ఉన్న దూకుడే మల్టీప్లెక్సుల్లోనూ నమోదు కావడం అతి పెద్ద విశేషం.

ఈ లెక్కన కాంతార ఫైనల్ వెర్షన్ పదిహేను కోట్ల దాకా షేర్ రాబడితే శాండల్ వుడ్ కు సంబంధించి తెలుగు రెవిన్యూ లెక్కల్లో ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇదే సంస్థ నిర్మించిన కెజిఎఫ్, కెజిఎఫ్ 2ల ఫిగర్లు చాలా భారీగా ఉన్నప్పటికీ పెట్టుబడి రాబడి సూత్రం ప్రకారం చూసుకుంటే మాత్రం కాంతారనే ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటుంది. రిషబ్ శెట్టి హైదరాబాద్ లోనే ఉంటూ ప్రత్యేకంగా ప్రమోషన్లు చేసుకుంటున్నారు. ఇవాళ మీడియాకు ప్రసాద్ ల్యాబ్స్ లో మరో షో వేసి సక్సెస్ ను షేర్ చేసుకోవడం కోసం ప్రెస్ మీట్ నిర్వహించారు. చూస్తుంటే కాంతార దెబ్బకు సౌత్ నుంచి ఇలాంటి గ్రామీణ నేపధ్యంలో వచ్చే సినిమాల సంఖ్య బాగా పెరిగేలా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి