iDreamPost

దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళ!

Zulekha Daud: ఇటీవల ఫోర్బ్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ టాప్‌ 100 ఇండియన్‌ లీడర్స్‌ ఇన్‌ యూఏఈ జాబితాను ప్రకటించింది. ఇందులో 84 ఏళ్ల జులేఖా దావూద్ చోటు దక్కించుకున్నారు. అయితే ఈమె ఈ అరుదైన ఘనత సాధించడం వెనుక ఎంతో కృషి ఉంది.

Zulekha Daud: ఇటీవల ఫోర్బ్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ టాప్‌ 100 ఇండియన్‌ లీడర్స్‌ ఇన్‌ యూఏఈ జాబితాను ప్రకటించింది. ఇందులో 84 ఏళ్ల జులేఖా దావూద్ చోటు దక్కించుకున్నారు. అయితే ఈమె ఈ అరుదైన ఘనత సాధించడం వెనుక ఎంతో కృషి ఉంది.

దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళ!

మన దేశం నుంచి ఎంతో మంది విదేశాలకు వెళ్లి నివాసం ఉంటున్నారు. అలాంటి వారిలో కొందరు మాములు జీవనం సాగిస్తుండగా మరికొందరు మాత్రం ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్నారు. అలా ఇండియా నుంచి వెళ్లిన చాలా మంది వివిధ దేశాల్లోని ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఉంటున్నారు. అలానే చాలా భారతీయలు విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించి అద్భుత విజయాలు సాధిస్తున్నారు.అలాంటి వారి జాబితాలో జులేఖా దావూద్ అనే మహిళ నిలిచారు. దుబాయ్ లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళగా జులేఖా దావూద్ వార్తల్లో నిలిచారు.

ఇటీవల ఫోర్బ్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ టాప్‌-100 ఇండియన్‌ లీడర్స్‌ ఇన్‌ యూఏఈ జాబితాను ప్రకటించింది. ఇందులో 84 ఏళ్ల జులేఖా దావూద్ చోటు దక్కించుకున్నారు. 84 ఏళ్ల జులేఖా ప్రస్తుతం రూ.3632 కోట్ల రెవెన్యూతో దుబాయ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచారు. 1964లో ప్రాక్టీస్‌ కోసం యూఏఈ వెళ్లిన తొలి భారత మహిళా వైద్యురాలి గా జులేఖా రికార్డుల కెక్కారు. ఆమె 2019లో విదేశీ భారతీయులకు భారతదేశ అత్యున్నత పురస్కారం, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును కూడా అందుకున్నారు.

ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, ఎదగడానికి మరియు మన లక్ష్యం వైపు పయనించడానికి చాలా ధైర్యం, కృషి అవసరమని ఆమె బలంగా నమ్మారు. ఆమె విజయం వెనుక అనేక కష్టాలున్నాయి. జులేఖా దావూద్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం బాగా ఆర్థికంగా వెనుకబడి ఉండేది. ఆమె తండ్రి రోజువారీ కూలీ, మరియు అతను తన కుటుంబానికి సహాయం చేయడానికి చాలా కష్టపడే వారు. అయితే, ఈ అడ్డంకులు జూలేఖ కలను ఆపలేకపోయాయి. తల్లీదండ్రుల కష్టాలను గుర్తుకు తెచ్చుకుని ఆమె కష్టపడి చదివారు. ఆమె నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ లో పట్టా పొందరు. అలానే బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ డిగ్రీలతో, గైనకాలజీలో స్పెషలైజేషన్‌తో పట్టాఅందుకున్నారు.

తన వైద్య విద్యను పూరైన అనంతరం ఆమె 1964లో ఆమె దుబాయ్ కి వెళ్లింది. దుబాయ్ లో మెడిసిన్ ప్రాక్టీస్ చేసిన తొలి భారతీయ మహిళా వైద్యురాలిగా ఆమె నిలిచారు. తన వృత్తి పట్ల తన అంకితభావాన్ని చూపించింది. ఆమె దుబాయ్‌లో ఎంతో మంది మహిళలకు ప్రసవం చేశారు. ఆమె పేరు మీదనే ఆస్పత్రి స్థాపించి అక్కడి ప్రజలకు వైద్యం అందించారు. ప్రస్తుతం జులేఖా హాస్పిటల్ గ్రూప్ యొక్క ప్రపంచ ఆదాయం 440 మిలియన్లు డాలర్లు అంటే మన కరెన్సీలో 3,632 కోట్లు రూపాయలు. ఇలా దుబాయ్ లో అత్యంత సంపన్న భారతీయ మహిళగా తొలి స్థానంలో జూలేఖ దావుద్ నిలిచారు. మరి..ఆమె లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి