iDreamPost

జగన్‌ను ఓడించడానికి.. యూట్యూబర్లతో చంద్రబాబు నీచ రాజకీయం: సీనియర్‌ జర్నలిస్ట్‌ జాకీర్‌

  • Published Mar 07, 2024 | 2:50 PMUpdated Mar 07, 2024 | 2:50 PM

జగన్‌ను ఓడించడానికి సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ చానెల్స్‌తో కలిసి చంద్రబాబు చేస్తోన్న నీచ రాజకీయలను సీనియర్‌ జర్నలిస్ట్‌ జాకీర్‌ బయట పెట్టారు. ఆ వివరాలు..

జగన్‌ను ఓడించడానికి సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ చానెల్స్‌తో కలిసి చంద్రబాబు చేస్తోన్న నీచ రాజకీయలను సీనియర్‌ జర్నలిస్ట్‌ జాకీర్‌ బయట పెట్టారు. ఆ వివరాలు..

  • Published Mar 07, 2024 | 2:50 PMUpdated Mar 07, 2024 | 2:50 PM
జగన్‌ను ఓడించడానికి.. యూట్యూబర్లతో చంద్రబాబు నీచ రాజకీయం: సీనియర్‌ జర్నలిస్ట్‌ జాకీర్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలలో సుమారు 98 శాతం వరకు నెరవేర్చారు. రాష్ట్రంలో సుమారు 90 శాతం కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఇప్పటికే వెలువడిన సర్వేలన్ని ఏపీలో మళ్లీ గెలిచేది జగనే అని నొక్కి వక్కాణిస్తున్నాయి. అత్యధిక శాతం ప్రజలు జగన్‌ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనాల్లో జగన్‌పై పెరుగుతున్న ఆదరణ చూసి విపక్ష కూటమి ఓటమి భయంతో ఒణికిపోతుంది. ఏ విషయంలోనూ జగన్‌ సర్కార్‌ను విమర్శించే అవకాశం లేదు. దాంతో జగన్‌ని ఓడించాడినికి అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేయించడం మొదలు పెట్టాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ.. జనాలను భయపెట్టే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు.. యూట్యూబర్లు, సోషల్‌ మీడియాతో కలిసి చేసిన నీచ రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దీని గురించి సీనియర్‌ జర్నలిస్ట్‌ జాకీర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈమధ్య కాలంలో నన్ను కొందరు యూట్యూబ్‌ చానెల్స్‌ వాళ్లు కలిశారు. వారంతా తమ తమ యూట్యూబ్‌ చానెల్స్‌లో టీడీపీకి, జనసేనకి అనుకూలంగా ప్రచారం చేస్తుంటారు. అలా వచ్చిన వారిలో చంద్రబాబు, తన పార్టీకి అనుకూలంగా పని చేసే ఓ యూట్యూబ్‌ చానెల్‌ వ్యక్తి నాతో మాట్లాడాడు. తను నాతో ఏం చెప్పాడంటే.. జగన్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.. ఈ పార్టీ దారుణంగా ఓడిపోతుంది.. కనీసం 15 స్థానాల్లో కూడా గెలవదు అని ప్రచారం చేయాలని టీడీపీ పెద్దలు తనకు సూచించారని చెప్పుకొచ్చాడు. దీన్ని పబ్లిక్‌లోకి బాగా తీసుకెళ్లాలని.. ఇందుకోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పినట్లు సదరు యూట్యూబర్‌ నాతో చెప్పాడు’’ అని వెల్లడించాడు.

అంతేకాక ‘‘కొంతమంది ఎన్నారైలు.. అది కూడా కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందిన వారు.. సదరు యూట్యూబ్‌ చానెల్‌ వ్యక్తికి కాల్‌ చేసి.. టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ.. 142 సీట్ల వరకు విజయం సాధిస్తుందని ప్రచారం చేయమని.. తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని.. ప్రచారం చేయాలని.. దీన్ని మౌత్‌ పబ్లిసిటీగా కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని.. అందుకు ఎంత మొత్తం కావాలంటే అంతా ఇస్తామని తనను ప్రలోభాలకి గురి చేసే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చాడు’’ అని తెలిపారు జాకీర్‌.

అంతేకాక ప్రశాంత్‌ కిషోర్‌ గత వారం రోజులుగా చేస్తోన్న వ్యాఖ్యల వెనక గల కారణాలను కూడా సదరు యూట్యూబర్‌ తనకు వివరించినట్లు జాకీర్‌ చెప్పుకొచ్చారు. ఈమధ్యకాలంలో చంద్రబాబు నాయుడు, ప్రశాంత్‌ కిషోర్‌ల మధ్య వరుస భేటీలు జరుగుతున్నాయని.. బాబు కొన్ని నియోజకవర్గాల బాధ్యతలను ప్రశాంత్‌ కిషోర్‌కు అప్పగించాడని ఆ యూట్యూబ్‌ చానెల్‌ అడ్మిన్‌ చెప్పాడు. అంటే ప్రశాంత్‌ కిషోర్‌.. టీడీపీ కోసం పని చేస్తూ.. వ్యూహాలు రచిస్తున్నాడని.. దానిలో భాగంగానే.. జగన్‌కు బిగ్‌ లాస్‌ అంటూ చేసిన వ్యాఖ్యలని సదరు యూట్యూబర్‌ వెల్లడించాడని జాకీర్‌ తెలిపారు.. దీని బట్టి విదేశాల్లో ఉన్న ఎన్నారైలు మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వారు చంద్రబాబు గెలవాలని.. అందుకోసం ఇలా అవాస్తవ ప్రచారాలకు దిగినట్లుగా అర్థం అవుతుంది అని చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి