iDreamPost

YSRTP బీఆర్‌ఎస్‌లో విలీనం.. స్వాగతించిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తుంది. ప్రధాన పార్టీ నేతలు ముమ్మ ర ప్రచారంలో మునిగిపోయారు. గెలుపు కోసం అన్ని పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తుంది. ప్రధాన పార్టీ నేతలు ముమ్మ ర ప్రచారంలో మునిగిపోయారు. గెలుపు కోసం అన్ని పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు.

YSRTP బీఆర్‌ఎస్‌లో విలీనం.. స్వాగతించిన మంత్రి హరీష్ రావు

తెలంగాణలో ఈ నెల 30 న తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు ముమ్మర ప్రచారంలో మునిగిపోయారు. ఈసారి తెలంగాణలో తమ ఆదిక్యత నిలుపుకొని మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు అధికార బీఆర్ ఎస్ గట్టి పట్టుమీద ఉంది. ఈసారి ఎలాగైనా అధికార పార్టీని గద్దె దింపి అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆశావాహులు తమకు టికెట్స్ వస్తాయని భంగపడి ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సాఆర్ టీపీ పార్ట ీనుంచి పలువురు నేతలు, డిస్ట్రిక్ కో ఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గట్టు రామ చందర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలో వైఎస్సాఆర్ టీపీ విలీనం చేయడానికి వచ్చిన నాయకులను మంత్రి హరీష్ రావు స్వాగతించారు. ఎన్నికల్లో వైఎస్సాఆర్ సీపీ పోటీ చేయడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి బైన్యాక్యులెర్ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. దీనిపై పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీపై పూర్తిగా నిరాసక్తి చూపించారు.

తెలంగాణలో షర్మిల స్థాపించిన వైఎస్సాఆర్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని.. ఎంతో నమ్మకంతో పార్టీలో చేరామని.. కానీ ఎన్నికల సమయంలో పార్టీ పోటీ చేయకపోవడం చాలా నిరుత్సాహాన్ని కలిగించిందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ సీపీ బేషెరతుగా మద్దతు ఇస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. నమ్మి వస్తే ఇలా తమను మోసం చేయడంతో మూకుమ్మడిగా నేతలు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే పార్టీనీ బీఆర్ఎస్ లో విలీనం చేయడానికి సిద్దమైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గట్టు రామచందర్ రావును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి