iDreamPost

Vijaya Sai Reddy: YSRCP ఎంపీ విజయ సాయిరెడ్డికి అరుదైన అవార్డు!

వైఎస్సార్ సీపీ లో కీలకమైన నేతల్లో విజయసాయిరెడ్డి ఒకరు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలపై తనదైన శైలీలో విజయసాయి రెడ్డి కౌంటర్లు ఇస్తుంటారు. అలానే పార్లమెంట్ లో ఏపీకి సంబంధించి కీలక అంశాలను ప్రస్తావిస్తుంటారు. తాజాగా విజయసాయిరెడ్డికి అరుదైన అవార్డు లభించింది.

వైఎస్సార్ సీపీ లో కీలకమైన నేతల్లో విజయసాయిరెడ్డి ఒకరు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలపై తనదైన శైలీలో విజయసాయి రెడ్డి కౌంటర్లు ఇస్తుంటారు. అలానే పార్లమెంట్ లో ఏపీకి సంబంధించి కీలక అంశాలను ప్రస్తావిస్తుంటారు. తాజాగా విజయసాయిరెడ్డికి అరుదైన అవార్డు లభించింది.

Vijaya Sai Reddy: YSRCP ఎంపీ విజయ సాయిరెడ్డికి అరుదైన అవార్డు!

అవార్డులు, రివార్డులు అనేవి ఓ మనిషి చేసిన కృషికి నిదర్శనం. వారి వారి రంగాల్లో లేదా ఇతర విషయాల్లో కృషి చేసిన వారికి అవార్డులు లభిస్తుంటాయి. ఇటీవలే కేంద్రం పద్మ అవార్డులతో పాటు దేశ అత్యున్నత గౌరవ పురస్కారం భారత రత్నను కూడా ప్రకటించింది. అలానే ప్రజాప్రతినిధులకు కూడా వివిధ గౌరవ పురస్కారాలు లభిస్తుంటాయి. తాజాగా వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కూడా ప్రత్యేక పురస్కారం లభించింది. ఆయన సంసద్ మహారత్న అవార్డును అందుకున్నారు.  విజయసాయిరెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్‌రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయముర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అవార్డును ప్రదానం చేశారు.

వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరు. ఆయన వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్తల్లో ఒకరిగా ఉన్నారు. అలానే వైఎస్సార్ సీపీ పార్టీ తరుపున రాష్ట్రానికి సంబంధించిన విషయాలను రాజ్యసభలో ప్రస్తావిస్తుంటారు. తాజాగా విజయసాయి రెడ్డికి సంసద్ మహారత్న అనే పురస్కారం లభించింది. టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి వ్యవహరించిన సంగతి తెలిసింది. ఈ విధుల్లో అత్యుత్తమ పనితీరుకు కనుబర్చినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇక, మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్‌తో కలిపి ఎంపీ విజయసాయి రెడ్డి  సంసద్ మహారత్న అవార్డును అందుకున్నారు.

మహారాష్ట్ర సదన్‌లో  ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఇక ప్రోగ్రామ్ లో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, సుప్రియ సులే, శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, హీనా గవిట్, జయంత్ సిన్హాలు కూడా ఈ అవార్డులను అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రసంగించారు. మహిళలకు అన్ని రంగాల్లో  అవకాశాలు కల్పించాలని ఆమె తెలిపారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ పాస్ చేయడం చారిత్రాత్మకం అని ఆమె అన్నారు.

పార్లమెంట్‌లో జరిగే చర్చల ఆధారంగా చట్టాల ఉద్దేశం తెలుస్తుందని, తెలంగాణ కొత్త రాష్ట్రానికి యంగ్ గవర్నర్ ఎలా పని చేస్తారని తన మీద విమర్శలు వచ్చాయని తెలిపారు. కానీ, తన పనితీరుతో రెండో రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ గా కూడా అవకాశం లభించిందని ఆమె పేర్కొన్నారు. పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని అప్పుడే దేశం మరింత అభివృద్ది చెందుతుందని ఆమె వ్యాఖ్యానించారు. మరి.. ఎంపీ విజయసాయి రెడ్డికి సంసద్ మహారత్న అవార్డు లభించడంతో పలువురు వైసీపీ నేతలు, ఇతర పార్టీల ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. మరి.. విజయ్ సాయిరెడ్డికి ఈ అవార్డు లభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి