iDreamPost

డిసెంబర్ 21న – వై.యస్.ఆర్ నేతన్న నేస్తం.

డిసెంబర్ 21న – వై.యస్.ఆర్ నేతన్న నేస్తం.

ముఖ్యమంత్రి జగన్ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ అమలుకు రంగం సిద్దం చేశారు, పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న చేనేతలను తాను అధికారంలోకి రాగానే ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నేరవేరుస్తు కష్టాలు ఏదుర్కుంటున్న చేనేతకు చేయుతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వై.యస్.ఆర్ నేతన్న నేస్తం పధకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యప్తంగా వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించి సోంత మగ్గం కలిగిన 67వేల మంది లబ్ది దారులను గుర్తించిన ప్రభుత్వం వారి ఖాతాల్లోకి ఏడాదికి 24వేల రూపాయలు చేరేలా ప్రణాళికలు సిద్దం చేశారు.

అయితే ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 21న ముఖ్యమంత్రి జగన్ వై.యస్.ఆర్ నేతన్న నేస్తం పేరుమీద అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆయన చెతుల మీదగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా దర్మవరం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సోంత మగ్గాలు ఉన్న ప్రతి కుటుంభానికి ఈ పధకం ద్వారా లబ్ది చేకూరుతుందని, దారిద్ర్య రేఖ దిగువున ఉన్న ప్రతీ చేనేత కుటుంభం ఈ పధకానికి అర్హులు అని అధికారులు చెప్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి