iDreamPost

Youtuber srikanth Reddy అమీర్ పేట్ సత్యం థియేటర్ దగ్గర బజ్జీలు అమ్ముకున్నా – ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి

Youtuber srikanth Reddy అమీర్ పేట్ సత్యం థియేటర్ దగ్గర బజ్జీలు అమ్ముకున్నా – ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి

క‌రాటే క‌ళ్యాణి గొడ‌వ‌తో ఎక్కువ‌మందికి తెలిసిన‌ యూట్యూబ‌ర్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి తన జీవితంలోని మ‌రోవైపు జ‌నం ముందుంచడానికి ప్ర‌య‌త్నించాడు. తన‌వి ప్రాంక్ వీడియోలేకాని, అశ్లీల వీడియోలుకావ‌ని, తాను జీవితంలో ఎలా ఎదిగాడో.. I Dream News Channelకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. జ‌ర్న‌లిస్ట్ స్వ‌ప్న ఈ ఇంట‌ర్వ్యూ చేశారు.

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం అనే చిన్న గ్రామంలో తల్లితో ఉండేవాడ్ని. తండ్రి కాలంచేశారు. బీఫార్మసీ చదవుకున్నా. మెడికల్ షాపులలో లేదా ల్యాబ్ లలో పనిచేయడానికి మనసొప్పలేదు. అక్కడిచ్చే జీతాలు ఎటూ సరిపోవు. అందుకే ఏదైనా సాధించాలన్న సంకల్పంతో హైదరాబాద్ కు వచ్చాను. ఉద్యోగం దొరక్కపోవడంతో.. అమీర్ పేట్ సత్యం థియేటర్ వద్ద బజ్జీలు అమ్ముకుని బతికాను. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి, ప్రాంక్ వీడియోలు చేయడం మొదలుపెట్టాను. నేను చేసిన ప్రాంక్ వీడియోలలో ఉన్నవారంతా నాకు తెలిసినవారే. ముఖపరిచయం లేనివారితో ప్రాంక్ వీడియోలు చేసి ఇబ్బంది పెట్టలేదు.

ప్రాంక్ వీడియోల‌న్నీ స్క్రిప్టెడ్!

ఎవరో ఏంటో తెలియకుండా ప్రాంక్ వీడియోలు చేస్తే ఎవరూ ఊరుకోరు. ప్రాంక్ వీడియోలన్నీ పక్కా స్క్రిప్టెడ్. ఏ డైలాగ్ కు ఎలా ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో ముందే చెప్తాం. ఆ వీడియోల్లో ఉన్నవారు జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులే. కరాటే కల్యాణి నాపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నేను చేసే వీడియోలు బాగోలేకపోతే.. నాకు లక్షల్లో ఫాలోవర్స్ ఉండరు. దేశ, విదేశాల్లో ఉన్నవారి వరకూ నా వీడియోలు రీచ్ కావు.

ఇప్పుడు నాలాగే ఆమె చేత బాధింపబడిన మరో వ్యక్తి, నన్ను కాంటాక్ట్ అయ్యాడు. ఆమె చేసిన దారుణాల గురించి చెప్పి, ఇద్దరం కలిసి పోరాడుదామన్నాడు. ఆమెపై ఎన్ని కేసులున్నాయో మొత్తం లిస్ట్ కూడా పంపాడు.

నేను ఏ అమ్మాయిల్నీ శారీరకంగా వాడుకుని వదిలేయలేదు. నాకు అదే కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ఉంది.
యువత తప్పుదారిలో వెళ్తుంటే. నువ్వు చేసేది తప్పు అని సామరస్యంగా చెప్పాలి గాని, ఇలా వీధికి ఈడ్చి అల్లరి చేయకూడదు. కరాటే కల్యాణి చేసిన పనికి మా అమ్మ చాలా ఏడ్చింది. సామాజిక కార్యకర్తగా చెప్పుకునే కరాటే కల్యాణి. సమాజానికి ఏం చేసిందో చెప్పమనండి. అని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి