iDreamPost

OTT Movie: రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొడుతుందా? OTTలో ఈ మూవీ చూడండి!

  • Published Apr 18, 2024 | 6:18 PMUpdated Apr 26, 2024 | 6:22 PM

థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా.. హిట్ ట్రాక్ లోనే నడుస్తాయన్న గ్యారంటీ లేదు. కానీ ఓటీటీ లో మాత్రం అటువంటి సినిమాలు మంచి టాక్ ను సంపాదించుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.

థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా.. హిట్ ట్రాక్ లోనే నడుస్తాయన్న గ్యారంటీ లేదు. కానీ ఓటీటీ లో మాత్రం అటువంటి సినిమాలు మంచి టాక్ ను సంపాదించుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.

  • Published Apr 18, 2024 | 6:18 PMUpdated Apr 26, 2024 | 6:22 PM
OTT Movie: రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొడుతుందా? OTTలో ఈ మూవీ చూడండి!

ఒకప్పుడు సినిమాలంటే కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యేవి. ఆ తర్వాత ఎప్పటికో ఆ సినిమాలు టెలివిజన్ లోకి వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ రెండిటికి మధ్యన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వచ్చేశాయి. వీటిలో వందల కొద్దీ సినిమాలు, సిరీస్ లు సందడి చేస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లో రిలీజ్ అవుతాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ లోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే థియేటర్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా హిట్ ట్రాక్ లోనే నడుస్తాయా అంటే.. కొన్నిసార్లు కథ బావున్నా కూడా.. అనేక కారణాల వలన హిట్ అవ్వకపోవచ్చు. కానీ, అలాంటి కథలు ఓటీటీ లోకి వస్తే మాత్రం.. ఒక రేంజ్ లో ఓటీటీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాయి. హీరో హీరోయిన్లు ఎవరైతే ఏంటి స్టోరీ ఎలా ఉంది అనేది చూస్తుంటారు ఓటీటీ లవర్స్. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే. ఈ సినిమా పేరు “ఏం చేస్తున్నావ్”. మరి ఈ సినిమా కథా కమామిషు ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఏం చేస్తున్నావ్ సినిమా 2023 లో వచ్చింది. ఈ సినిమా నేరుగా థియేటర్స్ లోనే రిలీజ్ అయింది. అయితే థియేటర్స్ లో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించకపోయినా కూడా.. ఓటీటీ లో మాత్రం అందరిని మెప్పించి. ఒక మంచి యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు.. భరత్ మిత్ర దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో కథ బావున్నా కూడా అందరు కొత్తవాళ్లే ఉండడంతో థియేటర్స్ లో అంతగా పేరు తెచ్చుకోలేదనే టాక్ వినిపించింది. కానీ, ఓటీటీ లో మాత్రం యూత్ ను మెప్పించింది. డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు ఎదుర్కునే ప్రశ్నలు.. ఎదురయ్యే సమస్యల చుట్టూ తిరిగే రియాలిటీ సన్నివేశాలతో.. ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమా 8.4 రేటింగ్ ను దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక ఏం చేస్తున్నావ్ సినిమా కథ విషయానికొస్తే.. హీరో తన బి.టెక్ పూర్తి చేసిన తర్వాత.. ఏం చేయాలో తెలియక నార్మల్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే అందరు అతనిని ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. రెండేళ్ల తర్వాత మరొక అమ్మాయి పరిచయం అవ్వడం ద్వారా అతను కెరీర్ లో సెటిల్ అవుతాడు. మరి మొదట ప్రేమించిన అమ్మాయి ఏమౌతుంది ! రెండవ సారి పరిచయం అయిన అమ్మాయి ఎవరు ! రెండేళ్ల పాటు అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇది రెగ్యులర్ గా అందరి లైఫ్స్ లో జరిగే స్టోరీ ఏ అవ్వడంతో.. యూత్ ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి