iDreamPost

లేడీ బస్ డ్రైవర్ కి పబ్లిసిటీ వచ్చింది.. ఉద్యోగం పోయింది!

లేడీ బస్ డ్రైవర్ కి పబ్లిసిటీ వచ్చింది.. ఉద్యోగం పోయింది!

ప్రతి మనిషిలో ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు బయట పడుతుంది. అలానే కొందరు తీవ్రంగా కృషి చేయడంతో మంచి గుర్తింపు సంపాదిస్తారు. అయితే అలా వచ్చిన పబ్లిసిటీ కొన్ని సార్లు వారి కొంపముంచుతుంది. తాజాగా ఓ లేడీ బస్ డ్రైవర్ విషయంలో అదే జరిగింది. మహిళా, అందులోనూ యువతి బస్ ను డ్రైవ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అందరూ తెగ ఎగబడ్డారు. అలా అతి తక్కువ సమయంలో ఎంతో పాపులారిటీ సంపాదించింది. వద్దంటే పాపులారిటీ వచ్చింది కానీ.. కావాలనుకున్న జాబ్ మాత్రం పోయింది. మరి.. ఆ వివరాలు  ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ జిల్లాలో గాంధీపురం ప్రాంతంలో షాళిని అనే యువతి ఓ ప్రైవేటు బస్సును డ్రైవ్ చేస్తుంది. ఆమె ప్రతిభను చూసి అందులోని ప్రయాణికులు  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు తెగ పోటీ పడ్డారు. అలా సోషల్ మీడియాలో షాళిని తెగ పాపులర్ అయింది. ఆడపిల్ల ఎంతో ధైర్యంగా బస్సును నడిపిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమెను పలువురు రాజకీయ ప్రముఖులు సైతం అభినంచారు. శుక్రవారం డీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, ఎంపీ కనిమొళి… షాళిని నడుపుతున్న బస్ లో గాంధీపురం నుంచి పీలమేడు వరకు ప్రయాణించారు.

ప్రయాణం అనంతరం షాళిని ప్రతిభను మెచ్చుకుంది. అలానే కనిమొళి ఆమెకు ఒక చేతి గడియారాన్ని బహూకరించారు. తాను నడిపిన బస్సులో కనిమొళి ప్రయాణించిన సమయంలో అందులోనూ మహిళా కండక్టర్‌ అనుచితంగా ప్రవర్తించిందంటూ ఫిర్యాదు చేసేందుకు షాళిని సంస్థ కార్యాలయానికి వెళ్లింది. అయితే, అక్కడ షాళినికి యజమాన్యం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెను జాబ్ నుంచి  తొలగించినట్లు సంస్థ వెల్లడించింది. యజమాన్యం తీసుకున్న నిర్ణయంపై షాళిని ఆశ్చర్యనికి గురైంది. తనను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని యాజమాన్యాన్ని ప్రశ్నించింది.  తన పబ్లిసిటీ కోసం బస్సులో ప్రయాణించేందుకు తరచుగా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ.. ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నట్లు ఫిర్యాదు అందిందని వారు తెలిపారు.

ఇచ్చిన సమాధానంకి ఏం చేయాలో తెలియక అక్కణ్నుంచి వచ్చేసినట్లు షాలిని తెలిపింది. కనిమొలి కంటే ముందు షాళిని నడిపిన బస్సులో సౌత్‌ కోయంబత్తూరు భాజపా ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌ కూడా ప్రయాణించినట్లు యాజమాన్యం తెలిపింది. ఇలా వద్దంటే వచ్చిన పబ్లిసిటీ కారణంగా  షాళిని జాబ్ కోల్పోయింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు సోషల్ మీడియాలో ఫైటింగ్  చేస్తున్నారు. మరి.. ఈ ఇష్యూపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి