iDreamPost

CM రేవంత్ రెడ్డి సార్ మా నాన్న ప్రాణాలు నిలబెట్టండి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యులు చేసే విన్నపాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. అలానే ఎంతో మంది నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే తమ విజ్ఞప్తులను వివిధ రూపాల్లో తెలియజేస్తుంటారు. తాజాగా ఓ యువకుడు తన తండ్రిని కాపాడమంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యులు చేసే విన్నపాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. అలానే ఎంతో మంది నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే తమ విజ్ఞప్తులను వివిధ రూపాల్లో తెలియజేస్తుంటారు. తాజాగా ఓ యువకుడు తన తండ్రిని కాపాడమంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు.

CM రేవంత్ రెడ్డి సార్ మా నాన్న ప్రాణాలు నిలబెట్టండి!

చాలా మంది  అనేక సమస్యలతో సతమతమవుతుంటారు. కొందరు ఆర్థిక ఇబ్బందులతో, మరికొందరు ఆరోగ్య సమస్యలతో నరకం చూస్తుంటారు. కొందరు అయితే తమ దయనీయ స్థితి గురించి ప్రజాప్రతినిధులకు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. పలు సభల్లో కానీ, సామాజిక మాద్యమాల ద్వారా గానీ ముఖ్యమంత్రిని కూడా సాయం కోరిన సందర్భాలు ఉన్నాయి. పలువురు తమను కాపాడండి.. అంటూ ఏకంగా సీఎంనే అభ్యర్థిస్తుంటారు. తాజాగా ఓ యువకుడు కూడా తన తండ్రి విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సాయం కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ నా తండ్రిని కాపాడంటూ ఆ యువకుడు కన్నీరు పెట్టుకున్నాడు.

గతేడాది రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ సభ జరిగింది. 2023 సెప్టెంబర్ 17 తేదీన కాంగ్రెస్ సభ నిర్వహించింది. జనగర్జన పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన ఆ సభకు సోనియా గాంధీ హాజరయ్యారు. ఆ వేదిక మీద నుంచి ఆరు గ్యారెంటీల హామీని కాంగ్రెస్ ఇచ్చింది. ఇక జనగర్జన సభకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు. అలానే సూర్యాపేట జిల్లాకు చెందిన కొమ్ము భిక్షం కూడా ఈ జనగర్జన సభకు హాజరయ్యారు.  సభ ముగిసిన అనంతరం తిరిగి సొంతూరికి భిక్షం బయలు దేరాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని హయత్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో భిక్షం తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అప్పటి నుంచి భిక్షం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేశారు. ఇక బాధితుడి కుటుంబ వల్ల కాకపోవడంతో.. ఆయన కుమారుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ కి విజ్ఞప్తి చేశాడు. సీఎం రేవంత్ రెడ్డి సార్ మా నాన్నను కాపాడండి అంటూ ఆయన కుమారుడు కొమ్ము శ్రీకాంత్ సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. ప్రస్తుతం తన తండ్రి ఎల్బీ నగర్  కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తమ పరిస్థితి దయనీయంగా ఉందని కొమ్ము శ్రీకాంత్ కన్నీరు పెడుతున్నారు. సర్జరీకి రూ. లక్షల్లో ఖర్చవుతుందని, సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆదుకోవాలని కోరుకున్నారు. మరి.. చూడాలి.. బాధితుడికి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందనేది. గతంలో అనేక సందర్భాల్లో సామాన్యులు చేసిన విజ్ఞప్తులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిచిన ఘటనలు అనేకం ఉన్నాయి. మరి.. కొమ్ము భిక్షం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి