iDreamPost

తండ్రి చనిపోయినా వెళ్ళలేకపోయిన యూపీ సీఎం

తండ్రి చనిపోయినా వెళ్ళలేకపోయిన యూపీ సీఎం

కరోనా కనికరం చూపడం లేదు. రానురాను కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇది అనేక మందిని కలచివేస్తుంది. కొందరికి మాత్రం మరచిపోలేని చేదు జ్ఞాపకం అవుతోంది. ఇప్పటికే అనేక మంది సొంత వారిని కూడా చూసుకోలేని స్థితి ఏర్పడింది. అనేక చోట్ల అంతిమయాత్ర కూడా చేసుకోలేని, సొంత వారిని కడచూపు నకు నోచుకోని సమస్య తలెత్తింది.

ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితి ఏకంగా యూపి సీఎం కి ఎదురయ్యింది. కన్నతండ్రి చనిపోయినా వెళ్లలేని అగమ్య పరిస్థితి అయన ఎదుర్కొన్నారు. సీఎం యోగి ఆదిత్యా నాథ్ స్వగ్రామం ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉంది. ఆయన తండ్రి ఆనంద్ సింగ్ అక్కడ అటవీ శాఖ రేంజర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ఇటీవల ఆయనకు ఆరోగ్యం దెబ్బతింది. అనారోగ్యంతో ఆయన్ని డిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. కాలేయం, మూత్రపిండాల సమస్య ముదరడం తో అయన మరణించారు.

అయినప్పటికీ లాక్ డౌన్ నిబంధన రీత్యా యూపీ సీఎం రాష్ట్రం దాటి వెళ్ళలేకపోతున్నట్టు తెలిపారు.  తండ్రి మరణానికి తీవ్రంగా దు:ఖిస్తున్నానని ప్రకటించిన సీఎం కరోనా మహమ్మారి కారణంగా తాను అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన తండ్రి కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. యోగి తండ్రి భౌతిక కాయాన్ని వారి స్వగ్రామం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గ్రామానికి తరలించారు. మంగళవారం ఉదయం అంతిమ సంస్కారాలు జరుగుతాయని ఆయన తరపు బంధువులు ప్రకటించారు. యోగి కుటుంబీకులు ఆ కార్యక్రమం పూర్తి చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించి, చివరకు కన్న తండ్రి కడ చూపునకు కూడా దూరంగా నిలవడం విశేషంగా మారింది. యోగి నిబద్ధత ని పలువురు కొనియాడుతున్నారు. కష్టకాలంలో కూడా ఆయన మనోధైర్యంతో వ్యవహరించారని అభిప్రాయపడుతున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి