iDreamPost

వైసిపి-బిజెపి నేతల వివాదంపై ఎల్లోమీడియా పైత్యపు రాతలు

వైసిపి-బిజెపి నేతల వివాదంపై  ఎల్లోమీడియా పైత్యపు రాతలు

ఎందుకంటే వైసిపి-బిజెపి మధ్య చెలిమి చెడిందా ? అని క్వశ్చన్ మార్కు పెట్టి అచ్చేసిన కథనంలో చివరకు చెలిమి చెడిండని తీర్మానించేసింది. చెలిమి చెడింది కాబట్టే వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరుకుందని చెప్పటమే విచిత్రంగా ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏరోజు కూడా వైసిపి, బిజెపి మధ్య మిత్రత్వంలేదు. బిజెపి జాతీయపార్టీ అన్న విషయం బహుశా ఎల్లోమీడియా మరచిపోయినట్లుంది. బిజెపితో పొత్తు పెట్టుకోవాలన్నా తెంచుకోవాలన్నా మాట్లాడాల్సింది జాతీయ నాయకత్వంతోనే కానీ రాష్ట్ర నాయకత్వంతో కాదన్న కనీసం ఇంగితం కూడా ఎల్లోమీడియాకు లేకపోయింది. పొత్తులు పెట్టుకోవటానికి 2014లో చంద్రబాబు కాళ్ళా వేళ్ళా పడింది కూడా కమలంపార్టీ జాతీయ నాయకత్వంతోనే కానీ రాష్ట్ర నాయకులతో కాదు.

కాబట్టి వైసిపి-బిజెపి మధ్య ఒకపుడు చెలిమి ఉన్నదీ లేదు ఇపుడు చెడిందీ లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక విజయసాయి, కన్నా లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు, ప్రత్యారోపణలన్నవి వ్యక్తిగత స్ధాయిలోనే జరుగుతున్నాయి. రెండు పార్టీల్లో నేతలు ఇద్దరిని సమర్ధిస్తున్నారంటే అదికూడా వ్యక్తిగతంగానే అనుకోవాలి. ఎందుకంటే పార్టీ విధానం ఇది అని వైసిపిలో ప్రకటించాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.

ఒకపార్టీ నేతపై మరోపార్టీ నేత ఆరోపణలు చేసినపుడు సహజంగానే ప్రత్యారోపణలు రావటం రెండు పార్టీల్లోని నేతలు స్పందించటం లాంటివి అన్నీ పార్టీల్లోనూ జరిగేదే. ఇపుడు విజయసాయి, కన్నా మధ్య కూడా జరుగుతున్నది కూడా ఇదే. అంత మాత్రాన వైసిపి, బిజెపి మధ్య చెలిమి చెడింది కాబట్టే మాటల యుద్ధం జరుగుతుందోని ఎల్లోమీడియా రాయటమంటే పైత్యపు రాతలు కాక మరేమిటి ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి