iDreamPost

చంద్రబాబును నమ్ముకున్నందుకు ఇంత పని జరిగిందా ?

చంద్రబాబును నమ్ముకున్నందుకు ఇంత పని జరిగిందా ?

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడును నమ్ముకున్నందుకు ఎల్లోమీడియాపై గట్టి దెబ్బే పడింది. తాజాగా వెలుగు చూసిన ఇండియన్ రీడర్స్ షిప్ సర్వేలో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల సర్క్యులేషన్ దారుణంగా పడిపోయాయి. అదే సమయంలో సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ మాత్రం కొంచెం పెరిగింది. సర్క్యులేషన్ పడిపోతున్నా మొత్తంమీద ఇప్పటికీ ఈనాడు తన టాప్ పొజిషన్ ను అయితే నిలబెట్టుకున్నది.

హోలు మొత్తం మీద చూస్తే ఈనాడు దినపత్రిక సర్క్యులేషన్ 82 లక్షల నుండి 63 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో సాక్షి దినపత్రిక సర్య్కులేషన్ మాత్రం 52 లక్షల నుండి 57 లక్షలకు పెరిగింది. ఇక ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ 38 లక్షల నుండి 30కి పడిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ క్రమంగా తగ్గిపోతుంటే సాక్షి సర్క్యులేషన్ మాత్రం పెరిగింది. అంటే ప్రతి మూడు నెలలకు తీసిన లెక్కల ప్రకారం ఇండియన్ రీడర్ షిప్ సర్వే నివేదికను బయటపెట్టింది.

ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నదేమంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ ఎందుకు పడిపోతోంది ? ఎందుకంటే చంద్రబాబును నమ్ముకున్నందుకే అని చెప్పుకోవాలి. మీడియా అన్నది ప్రజాపక్షం వహించాలి. అంటే ప్రభుత్వానికి ప్రతిపక్షంగానే వ్యవహరించాలి. ఆ క్రమంలో ప్రభుత్వం మంచి చేస్తే మంచిని హైలైట్ చేయాలి. అదే విధంగా లోపాలుంటే వాటిని కూడా ఎత్తి చూపాలి. ఏ ఒక్క రాజకీయపార్టీకి మద్దతుగా నిలబడకూడదు.

కానీ ఏపిలో మాత్రం పై రెండు దినపత్రికలు నిసిగ్గుగా చంద్రబాబును భుజానేసుకుని ఊరేగుతున్నాయి. కేవలం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లుతోంది. అంటే ఈ దినప్రతికలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి కనబడటం లేదు. దాంతో జనాలకు జరుగుతున్న మంచిని కూడా ఈ మీడియా చెడుగా చిత్రీకరిస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. బహుశా ఇటువంటి అనేక కారణాలతోనే జనాలు పై రెండు పత్రికలను చదవటం తగ్గించేశారేమో ?

పేదల పిల్లల కోసం ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెడితే ప్రతిపక్షాలో పాటు ఎల్లోమీడియా కూడా అడ్డుకుంది. అంతకుముందు భారీ వర్షాలు, వరదల కారణంగా ఇసుక కొరత వస్తే దానికి జగన్మోహన్ రెడ్డే కారణమంటూ ప్రతిపక్షాలతో పాటు ఎల్లోమీడియా కూడా నానా యాగీ చేసింది. మూడు రాజధానుల ప్రతిపాదన తో పాటు తాజాగా పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై ప్రతిపక్షాలకు మద్దతుగా ఎల్లోమీడియా కూడా గోల చేస్తోంది. అంటే ఇటువంటి పనికిమాలిన రాతల వల్లే పాఠకుల ఆధరణ కోల్పోతున్న విషయం అర్ధమైపోతోంది.

ఏదేమైనా చంద్రబాబును భుజానేసుకున్న కారణంగా లక్షల్లో సర్క్యులేషన్ కోల్పోవాల్సి రావటం షాక్ అనే చెప్పాలి. అదే సమయంలో సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ పెరగటం ఆసక్తిగానే ఉంది. ప్రభుత్వ వ్యవహారాలు తెలుసుకునేందుకు, చంద్రబాబుపై ఎదురుదాడి చూస్తున్నందుకే సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ పెరిగిందనే అనుకోవాలా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి