iDreamPost

Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌పై జైస్వాల్‌ దండయాత్ర! వరుసగా రెండో డబుల్‌ సెంచరీ

  • Published Feb 18, 2024 | 1:10 PMUpdated Feb 18, 2024 | 1:10 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా మరింత పట్టుబిగిస్తోంది. యువ ఆటగాళ్లు జైస్వాల్‌-సర్ఫరాజ్‌ ఖాన్‌ టీ20 స్టైల్లో స్కోర్‌బోర్డ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ కమ్రంలో జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇంగ్లండ్‌పై యశస్వి జైస్వాల్‌ తన దండయాత్రను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్ట్‌లో హాఫ్‌ సెంచరీ, రెండో టెస్టులో ఏకంగా డబుల్‌ సెంచరీతో చెలరేగిన ఈ యువ సంచలనం తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ డబుల్‌ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ ఎటాక్‌ను చీల్చిచెండాడుతూ రెచ్చిపోయాడు. మూడో రోజు ఆటలోనే సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌ వెన్నునొప్పి కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. నాలుగో రోజు ఆటలో శుబ్‌మన్‌ గిల్‌ అవుటైన తర్వాత మళ్లీ క్రీజ్‌లోకి వచ్చిన జైస్వాల్‌.. టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేశాడు.

ముఖ్యంగా ఇంగ్లండ్‌ సీనియర్‌ బౌలర్‌ జెమ్స్‌ అండర్సన్‌ను టార్గెట్‌గా చేసుకుని మరి జైస్వాల్‌ రెచ్చిపోయాడు. అండర్సన్‌ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా మూడు వరుస సిక్సులతో చుక్కలు చూపించాడు. నిజానికి అండర్సన్‌ అనుభవం అంత లేదు జైస్వాల్‌ వయసు.. కానీ, ఆటలో మాత్రం ఆ లెజెండ్‌కి చుక్కలు చూపించాడు. మొత్తంగా 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సులతో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైస్వాల్‌ విధ్వంసానికి సర్ఫరాజ్‌ కూడా తోడయ్యాడు. ఇద్దరూ కలిసి.. స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. వారిద్దరి దెబ్బ టీమిండియా లీడ్‌ 500 దాటేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి