iDreamPost

కిరాణా షాపులో యశ్ షాపింగ్..! ఇదేమి సింప్లిసిటీ స్వామి!

Yash- Radhika Pandit: రాకింగ్ స్టార్ యష్ తన సింప్లిసిటీతో అభిమానుల హృదయాలు కొల్లగొడుతూనే ఉన్నాడు. తాజాగా యష్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

Yash- Radhika Pandit: రాకింగ్ స్టార్ యష్ తన సింప్లిసిటీతో అభిమానుల హృదయాలు కొల్లగొడుతూనే ఉన్నాడు. తాజాగా యష్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

కిరాణా షాపులో యశ్ షాపింగ్..! ఇదేమి సింప్లిసిటీ స్వామి!

రాకింగ్ స్టార్ యష్ అలియాస్.. రాఖీ భాయ్. ఈయన స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ లో ఎంతో కష్టపడి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. కేవలం కేజీఎఫ్ అనే సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్ రెండు పార్టులు ప్రేక్షకుల్లో యష్ స్థాయిని ఆకాశానికి తీసుకెళ్లాయి. ఇంకా ఆ మూవీ నుంచి పార్ట్ 3 కూడా రావాల్సి ఉంది. దాని కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే యష్ ఎంత సింపుల్ గా ఉంటాడో అందరికీ తెలుసు. తాజాగా యష్ దంపతులకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి భారీ హిట్లు అందుకున్న తర్వాత యష్ దాదాపు రెండేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. తాజాగా ఈ పాన్ ఇండియా హీరో టాక్సిక్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే యష్ వ్యక్తిగత జీవితానికి సంబధించిన విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా యష్ సింప్లిసిటీ గురించి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. ఇటీవలే యష్ దంపతులు తన అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. అతనికి బిడ్డ పుట్టిన విషయం తెలిశాక సతీసమేతంగా వాళ్ల ఇంటికి వెళ్లి బిడ్డను ఆశీర్వదించడమే కాకుండా.. బంగారు గొలుసు కూడా బహూకరించాడు.

తాజాగా యష్ దంపతుల సింప్లిసిటీకి సంబంధించిన మరో ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. యష్ భార్య రోడ్డు పక్కన చిన్న కిరాణా కొట్టు దగ్గర కూర్చుని ఐస్ తింటోంది. అక్కడే ఉన్న యష్ ఆమెకు ఐస్, చాక్లెట్స్ కొనిస్తూ ఉన్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల యష్ దంపతులు చిత్రపుర మఠం ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా భార్య రాధిక అడిగిందని యష్ అలా రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో ఐస్ కొనిచ్చాడు. ఇంతటి స్టార్డమ్, పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ వచ్చినా కూడా ఇంత సింపుల్ గా ఎలా ఉండగలుగుతున్నాడు అంటూ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. పైగా యష్ కొనిచ్చాడు సరే.. రాధిక కూడా చక్కగా కూర్చుని తినేస్తోంది. నిజంగా సింప్లిసిటీ అనే పదానికి ఈ దంపతులు నిలువెత్తు రూపం అంటూ పొగిడేస్తున్నారు.

యష్ ఇంత సింపుల్ గా ఉండటానికి తన తండ్రి కూడా ఒక కారణం అంటూ ఉంటారు. ఎందుకంటే యష్ ఒక గొప్ప హీరో అయినా కూడా తన తండ్రి మాత్రం డ్రైవింగ్ ఆపలేదు. ఆయన ఆర్టీసీ బస్సుకు డ్రైవర్ ఉద్యోగం చేసేవారు. కొడుకు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఆయన తన వృత్తిని మాత్రం ఆపలేదు. అలాంటి తండ్రికి ఇలాంటి కొడుకులే పుడతారు అంటూ యష్ తండ్రిని కూడా పొగిడేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ తన 19వ చిత్రాన్ని చేస్తున్నాడు. టాక్సిక్ అనే పేరుతో టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 10, 2025 రిలీజ్ చేయబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు. మరి.. పాన్ ఇండియా హీరో అయ్యుండి ఇంత సింపుల్ గా ఉన్న యష్ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి