iDreamPost

వైసీపీ మేనిఫెస్టో అందుబాటులోనే ఉంది..! ఒక్కసారి చూడండి యనమల గారు..!!

వైసీపీ మేనిఫెస్టో అందుబాటులోనే ఉంది..!  ఒక్కసారి చూడండి యనమల గారు..!!

వైసీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శలు, ఆరోపణలు చేసేందుకు నిత్యం సిద్ధంగా ఉండే మాజీ మంత్రి, టీడీపీ మండలి నేత యనమల రామకృష్ణుడు ఈ రోజు మళ్ళి తెరపైకి వచ్చారు. రాష్ట్రప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చేస్తోందంటూ యనమల విమర్శించారు. మద్యం తయారీ కంపెనీల ఒత్తిడి మేరకే సీఎం వైఎస్ జగన్ మద్యం ధరలు 25 శాతం మేర పెంచారని ఆరోపించారు.

తన ప్రజా సంకల్ప పాదయాత్ర లో మద్యం రక్కసి వల్ల చిన్నాభిన్నమైన కుటుంబాల దయనీయ పరిస్థితిని చూసి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టో ప్రస్తుతం ఆన్లైన్లో, వైసిపి వెబ్సైట్లో అందుబాటులో ఉంది. వైసిపి ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, ఆరోపణలు చేసే ముందు యనమల రామకృష్ణుడు తో పాటు టిడిపి నేతలు కూడా ఆ మేనిఫెస్టోను ఒకసారి చూస్తే నవ్వులపాలు కాకుండా ఉంటారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యపానాన్ని మూడు దశల్లో అమలు చేస్తానని, మద్యాన్ని క్రమక్రమంగా పేదలకు దూరం చేస్తామని సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా చెప్పారు. మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా పెంచి ఆ మహమ్మారిని పేదలకు దూరం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు భరోసా ఇచ్చారు. చివరకు కేవలం ఫైవ్ స్టార్ హోటల్ లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుందని, అక్కడ కూడా ధరలు ఆకాశాన్ని తాకేలా గా ఉంటాయని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

ఆ దిశగా అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి దశ మద్యపాన నిషేధం లో మొదటి దశ అమలు చేశారు దుకాణాలు 20 శాతం మేర తగ్గి చేశారు. అక్రమ అమ్మకాలు, బెల్ట్ షాపులు లేకుండా నేరుగా ప్రభుత్వం ద్వారా మద్యం షాపులను నిర్వహిస్తున్నారు. దుకాణాల వద్ద తాగేందుకు వీలులేకుండా పర్మిట్ రూమ్లను ఎత్తేసారు. దుకాణాల సమయపాలన కుదించారు. మద్యం ధరలు పెంచారు.

ప్రభుత్వ నిర్ణయాల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు కూడా తెరవచ్చు అని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఏపీలో దుకాణాలను తెరుస్తూనే మద్యాన్ని ప్రజలకు మరింత దూరం చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ధరలు 25 శాతం పెంచాలని, మద్యం దుకాణాలు తగ్గించాలని నిర్ణయించారు. అయితే యనమల రామకృష్ణుడు మాత్రం మద్యం తయారీ కంపెనీల ఒత్తిడి వల్ల మాత్రమే ధరలు పెంచారని ఆరోపిస్తుండడం విడ్డురంగా ఉంది.

యనమల అన్నట్లుగా మద్యాన్ని ఆదాయ వనరుగా చూసేటట్లైతే గత ప్రభుత్వ హయాంలో లాగా పర్మిట్ రూమ్ పేరుతో ఎకరాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో సదుపాయలు ఏర్పాట్లు చేయించేవారు కానీ పర్మిట్లు రూమ్ లు ఎందుకు ఎత్తి వేస్తారన్న లాజిక్ సామాన్య మానవులకి అర్థమవుతుంది. అలాంటిది మేధావి అయిన యనమల రామకృష్ణుడు అర్థం కాకపోవడమే ఇక్కడ విచిత్రం. ఏమైనా టిడిపి నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఒకసారి చూడడం వారికి ఎంతో మేలు చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి