iDreamPost

క్రికెట్ దేవుడు రిటైరై 10 ఏళ్లవుతున్నా అదే అభిమానం.. ఫ్యాన్స్ అంతే బాస్!

  • Author singhj Published - 12:36 PM, Sun - 22 October 23

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రిటైరై దాదాపుగా పదేళ్లు కావొస్తోంది. అయినా ఆయనపై ఫ్యాన్స్​కు ఏమాత్రం ఇష్టం, అభిమానం తగ్గలేదు. ఛాన్స్ వచ్చినప్పుడు సచిన్​ మీద అభిమానాన్ని ఫ్యాన్స్ చూపిస్తున్నారు.

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రిటైరై దాదాపుగా పదేళ్లు కావొస్తోంది. అయినా ఆయనపై ఫ్యాన్స్​కు ఏమాత్రం ఇష్టం, అభిమానం తగ్గలేదు. ఛాన్స్ వచ్చినప్పుడు సచిన్​ మీద అభిమానాన్ని ఫ్యాన్స్ చూపిస్తున్నారు.

  • Author singhj Published - 12:36 PM, Sun - 22 October 23
క్రికెట్ దేవుడు రిటైరై 10 ఏళ్లవుతున్నా అదే అభిమానం.. ఫ్యాన్స్ అంతే బాస్!

క్రికెట్​ను మన దేశంలో ఒక మతంగా భావించే వాళ్లు కోట్లలో ఉన్నారు. క్రికెట్​ ఓ మతమైతే సచిన్ టెండూల్కర్​ దానికి దేవుడు అనే మాట ఊరికే రాలేదు. ఇండియాలోని ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్​కు ఆరాధ్యుడు సచిన్. మాస్టర్ బ్లాస్టర్ క్రీజులో దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. సచిన్ పిచ్ మీద ఉన్నాడంటే గెలుస్తామనే నమ్మకం, భరోసా ఫ్యాన్స్​లో ఉండేది. అందుకు తగ్గట్లే వారిని ఎప్పుడూ నిరాశపర్చకుండా అద్భుతమైన ఆటతీరుతో దాదాపు రెండున్నర దశాబ్దాలు భారత్​కు సేవలు అందించాడు మాస్టర్. సుదీర్ఘ కెరీర్​లో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.

22 గజాల క్రికెట్​ పిచ్​పై సచిన్ టెండూల్కర్ చూడని రికార్డు లేదు, అతడికి దక్కని ట్రోఫీ లేదు. తీరని కోరికగా ఉన్న వన్డే వరల్డ్ కప్​ డ్రీమ్​ను 2011లో నెరవేర్చుకున్నాడు సచిన్. మిగిలిన టోర్నీల్లో ఎంత బాగా ఆడతాడో ప్రపంచ కప్​లో అంతకు మించి బ్యాటింగ్ చేస్తాడు సచిన్. దీనికి 2003 వరల్డ్ కప్ మంచి ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. ఆ ఏడాది మెగా టోర్నీలో ఏకంగా 673 రన్స్ చేశాడు మాస్టర్. 2011 వరల్డ్ కప్​లోనూ పలు కీలక ఇన్నింగ్స్​లు ఆడాడు. మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​తో కలసి మంచి స్టార్ట్​లు అందించాడు. ప్రపంచ కప్ డ్రీమ్ నెరవేరిన తర్వాత కూడా ఇంటర్నేషనల్ క్రికెట్​లో కొన్నాళ్ల పాటు కంటిన్యూ అయ్యాడు సచిన్.

వెస్టిండీస్​పై నవంబర్ 14, 2013లో ఆడిన టెస్ట్ మ్యాచే క్రికెట్​లో సచిన్ టెండూల్కర్ లాస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్ తర్వాత సచిన్ మళ్లీ బ్యాట్ పట్టలేదు. క్రికెట్ దేవుడు రిటైర్మెంట్ తీసుకొని పదేళ్లు కావొస్తోంది. అయినా సచిన్​పై అభిమానులకు ఇసుమంత కూడా ప్రేమ, అభిమానం తగ్గలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా సచిన్​పై తమకు ఉన్న ఇష్టాన్ని చూపిస్తుంటారు ఫ్యాన్స్. సచిన్ హోమ్ గ్రౌండ్ అయిన ముంబైలోని వాంఖడేలో ఆడియెన్స్ అయితే ఈ విషయంలో అందరికంటే ముందుంటారు.

వరల్డ్ కప్​-2023లో భాగంగా ఇంగ్లండ్-సౌతాఫ్రికా మ్యాచ్​కు వాంఖడే ఆతిథ్యం ఇచ్చింది. ఈ మ్యాచ్​లో ఇండియన్ ఫ్యాన్స్ సచిన్​పై మరోమారు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పదే పదే ‘సచిన్.. సచిన్’ అంటూ మాస్టర్ నామస్మరణ చేశారు. ఫ్యాన్స్ సచిన్​పై ప్రేమను చూపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ బాస్.. సచిన్ ఫ్యాన్స్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రిటైరై పదేళ్లవుతున్నా సచిన్​పై అభిమానం చూపించడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్లాసెన్, మార్​క్రమ్ కాదు.. సౌతాఫ్రికాకు కొత్త సూపర్​స్టార్ దొరికేశాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి