iDreamPost

కోహ్లీ అరుదైన ఘనత.. క్రికెట్ దేవుడి రికార్డును బ్రేక్ చేసిన విరాట్!

  • Author singhj Published - 05:23 PM, Thu - 2 November 23

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న మరో రికార్డును స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న మరో రికార్డును స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 05:23 PM, Thu - 2 November 23
కోహ్లీ అరుదైన ఘనత.. క్రికెట్ దేవుడి రికార్డును బ్రేక్ చేసిన విరాట్!

బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్​ను చాలా మంది ఫ్యాన్స్ క్రికెట్ దేవుడిగా భావిస్తుంటారు. తనకు పేరు, ఫేమ్, క్రేజ్ తీసుకొచ్చిన క్రికెట్​కు సచిన్ అందించిన సేవల్ని అంత ఈజీగా మర్చిపోలేం. అతడి బ్యాటింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. క్రికెట్​లో అనితర సాధ్యమైన ఎన్నో రికార్డుల్ని సాధించాడు కాబట్టే అతడ్ని క్రికెట్ దేవుడని పిలుస్తుంటారు అభిమానులు. అలాంటి సచిన్ వారసుడే ప్రస్తుత భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మాస్టర్ బ్లాస్టర్ అడుగుజాడల్లోనే నడుస్తూ భారత టీమ్ భారాన్ని మోస్తూ వస్తున్నాడు కోహ్లీ. టీమ్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి క్రీజులోకి వచ్చి తన బ్యాటింగ్​తో ఆదుకుంటున్నాడు. ఎన్నో క్లిష్టమైన మ్యాచుల్లో లాస్ట్ వరకు నిలబడి మ్యాచ్​లు గెలిపిస్తున్నాడు కోహ్లీ.

ముఖ్యంగా ఛేజింగ్ టైమ్​లో కోహ్లీ క్రీజులో పాతుకుపోతే అవతలి టీమ్ మ్యాచ్​పై ఆశలు వదులుకోవాల్సిందే. ఛేదనలో అలాంటి రికార్డు ఉంది కాబట్టి కోహ్లీని అందరూ ఛేజింగ్ కింగ్ అని అంటుంటారు. నిలకడగా రన్స్ చేయడంలో సచిన్​ను ఫాలో అవుతున్న కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. మరో కొన్నేళ్లు ఇలాగే ఆడితే సచిన్ పేరిట ఉన్న దాదాపు అన్ని రికార్డులను అతడు బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తాజాగా సచిన్ సాధించిన ఓ అరుదైన రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో సచిన్​ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు.

లంకతో మ్యాచ్​లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కోహ్లీ. ప్రస్తుతానికి అతడి స్కోరు 39 నాటౌట్. ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో క్యాలండ్ ఇయర్​లో ఎక్కువసార్లు 1,000 రన్స్ చేసిన బ్యాటర్​గా కోహ్లీ నిలిచాడు. క్యాలండ్ ఇయర్​లో వెయ్యి పరుగుల మైలురాయిని ఎక్కువసార్లు అందుకున్న ప్లేయర్​గా కోహ్లీ (8 సార్లు) నిలిచాడు. అతడి తర్వాతి ప్లేసులో గ్రేట్ సచిన్ టెండూల్కర్ (7) ఉన్నాడు. ఇప్పటికే సచిన్ పేరు మీద ఉన్న చాలా రికార్డుల్ని బ్రేక్ చేసిన కోహ్లీ.. తాజాగా మరో అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకోవడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నవంబర్ లో రోహిత్ కి అదృష్టం! ఈ లెక్కన వరల్డ్ మనదేనా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి