iDreamPost

అనవసరంగా కోహ్లీని తిట్టుకున్నారు.. కానీ వాళ్లేం చేశారో చూశారా?

  • Author singhj Published - 12:53 PM, Mon - 6 November 23

సౌతాఫ్రికాతో మ్యాచ్​లో టీమిండియా 243 రన్స్ తేడాతో గెలిచి వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్​లో ఫస్ట్ ప్లేస్​ను కాపాడుకుంది. ఈ గెలుపులో బౌలర్ల పాత్ర ఎంత ఉందో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రోల్ అంతకంటే ఎక్కువేనని చెప్పాలి.

సౌతాఫ్రికాతో మ్యాచ్​లో టీమిండియా 243 రన్స్ తేడాతో గెలిచి వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్​లో ఫస్ట్ ప్లేస్​ను కాపాడుకుంది. ఈ గెలుపులో బౌలర్ల పాత్ర ఎంత ఉందో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రోల్ అంతకంటే ఎక్కువేనని చెప్పాలి.

  • Author singhj Published - 12:53 PM, Mon - 6 November 23
అనవసరంగా కోహ్లీని తిట్టుకున్నారు.. కానీ వాళ్లేం చేశారో చూశారా?

50 ఓవర్ల ఫార్మాట్​లో విరాట్ కోహ్లీలా డామినేషన్ చలాయిస్తున్న ప్లేయర్ మరొకరు లేరనే చెప్పాలి. గేమ్​లో కోహ్లీ నెలకొల్పుతున్న స్టాండర్డ్స్ అసామాన్యం. ఎంత ఒత్తిడి ఉన్నా అతడు భరిస్తాడు. ప్రెజర్​లోనే విరాట్​లోని అసలైన ప్లేయర్ బయటికొస్తాడు. తీవ్ర ఒత్తిడి ఉంటే ఛేదనలో అంత బాగా ఆడతాడు కాబట్టే అతడ్ని ఛేజింగ్ కింగ్ అని అంటారు. టార్గెట్ ఎంతున్నా, ఒకవైపు వికెట్లు పడుతున్నా, బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నా కోహ్లీ మాత్రం ఆగేదేలే అంటూ దూసుకెళ్తాడు. సౌతాఫ్రికాపై తాజా సెంచరీతో వన్డే క్రికెట్​లో తాను ఎందుకంత డేంజర్ ప్లేయరో మరోమారు ప్రూవ్ చేశాడు విరాట్ కోహ్లీ.

రోహిత్ శర్మ, శుబ్​మన్ గిల్ అవుటైన నేపథ్యంలో రన్స్ రావడం కష్టంగా మారిన ఈడెన్ గార్డెన్స్ పిచ్​పై సెంచరీతో తనకు ఏదైనా సాధ్యమేనని చూపించాడు విరాట్. ఈ ఇన్నింగ్స్ కోహ్లీ కెరీర్​లో చాలా స్పెషల్ అనే చెప్పాలి. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును అందుకోవాలనే కోరికతో ఈ మధ్య మూడంకెల మార్క్​కు దగ్గరకు రాగానే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు కోహ్లీ. మెళ్లిగా ఆడుతూ సెంచరీ కోసం ప్రయత్నించి, ఒత్తిడిలో పడి ఔట్ అవుతున్నాడు. నిన్న అతడి బర్త్ డే కూడా కావడంతో ఆ ప్రెజర్ రెట్టింపు అయింది. కానీ కోహ్లీ మాత్రం కూల్​గా ఆడాడు. రోహిత్, గిల్ ఔటవ్వడంతో తాను బాధ్యతను తీసుకున్నాడు.

శ్రేయస్ అయ్యర్​తో కలసి 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు కోహ్లీ. అయితే మధ్యలో కాస్త నెమ్మదించాడు విరాట్. పిచ్​ మరీ కఠినంగా ఉండటంతో వికెట్ కాపాడుకోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఒక్కసారి కుదురుకున్నాక అయ్యర్​తో కలసి హిట్టింగ్​కు దిగాడు. మొదట్లో డాట్ బాల్స్ ఎక్కువగా ఆడినా.. లాస్ట్​కు వచ్చేసరికి 121 బంతుల్లో 101 రన్స్ చేసి లెక్కసరిచేశాడు. అయితే స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్​తో పాటు క్రికెట్ అనలిస్టులు కూడా కోహ్లీ స్లో బ్యాటింగ్​పై కంప్లెంట్స్ చేశారు. ఇలాగైతే మ్యాచ్ గెలిచినట్లేనని కామెంట్స్ చేశారు. కోహ్లీ సెంచరీ, రికార్డుల కోసం చూసుకుంటున్నాడని తిట్టుకున్నారు.

మొదట్లో కోహ్లీని తిట్టుకున్న ఫ్యాన్స్​.. ఆ తర్వాత తమ తప్పేంటో తెలుసుకున్నారు. ఎందుకంటే తొలుత నెమ్మదిగా ఆడిన విరాట్.. ఆఖరికి వచ్చేసరికి ఆడిన బంతులకు తగ్గట్లే స్కోరును దాదాపుగా సమం చేశాడు. అతడి బ్యాటింగ్ వల్లే 270 స్కోరు చేయాల్సిన భారత్ కాస్తా 326 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఒత్తిడిలో పడిన సౌతాఫ్రికా 83 రన్స్​కే కుప్పకూలింది. సఫారీ బ్యాటర్లు ఒక్కో రన్​కు కష్టపడ్డారు. బాల్​ను టచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఇది చూసిన కోహ్లీ ఫ్యాన్స్ అతడ్ని మెచ్చుకుంటున్నారు. కోహ్లీ ఒక్కడు 101 రన్స్ చేస్తే.. సౌతాఫ్రికా టీమ్ మొత్తం కలసి 83 రన్స్ చేసిందని అంటున్నారు. అనవసరంగా కోహ్లీని చాలా మంది తిట్టుకున్నారని.. కానీ ఇలాంటి పిచ్​పై సెంచరీ చేసిన విరాటే రియల్ కింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు. మరి.. కోహ్లీ కూల్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గేల్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. ICC టోర్నమెంట్స్ హిస్టరీలోనే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి