iDreamPost

ప్రభుత్వోద్యోగులకు వర్క్ ఫ్రోమ్ హోమ్

ప్రభుత్వోద్యోగులకు వర్క్ ఫ్రోమ్ హోమ్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సచివాలయంతోబాటు జిల్లాల్లోని కార్యాలయాల్లోని సిబ్బంది ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశం కల్పించింది. మొత్తం సిబ్బందిలో సగం మంది ఆఫీసుకు వస్తే చాలని, మిగతావాళ్లు ఇళ్ల నుంచి పని చేయొచ్చని స్పష్టం చేసింది. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది.

అయితే వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ లేకుండా ఐచ్ఛిక శెలవులు కూడా కొంతమందికి ఇచ్చేలా ప్లాన్ చేసింది ప్రభుత్వం. 50 ఏళ్లు పైబడిన ఉద్యోగుల్లో ఎవరైనా జలులు, దగ్గు, షుగర్, ఆయాసం వంటి వాటితో ఇబ్బంది పడితే వాళ్లంతట వాళ్లు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లొచ్చని, 4వ తేదీ వరకు శెలవులు ఇస్తామని ప్రకటించింది. అత్యవసర సేవల్లో ఉన్న విభాగాలకు, అంటే ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇది వర్తించదు. ఇక కరోనా నేపథ్యంలో యంత్రాంగం మొత్తాన్ని దీనిపైనే నిమగ్నం చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి