iDreamPost

కెమెరా కోసం దారుణం.. యువతితో ఆ పని చేస్తూ దొరికిపోయిన నిందితుడు..

కెమెరా కోసం ఫ్రెండ్ గా పరిచయం అయ్యి తన ఊరు పిలిపించుకుని మరీ హత్య చేశారు. అయితే ఓ యువతి వల్లే నిందితుడు పోలీసులకు చిక్కాడు.

కెమెరా కోసం ఫ్రెండ్ గా పరిచయం అయ్యి తన ఊరు పిలిపించుకుని మరీ హత్య చేశారు. అయితే ఓ యువతి వల్లే నిందితుడు పోలీసులకు చిక్కాడు.

కెమెరా కోసం దారుణం.. యువతితో ఆ పని చేస్తూ దొరికిపోయిన నిందితుడు..

ఆ యువకుడికి ఫోటోగ్రఫీ అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే ఫోటోగ్రఫీ రంగంలో అడుగుపెట్టాడు. పేదవారు అయినప్పటికీ అతని తల్లిదండ్రులు అప్పు చేసి మరీ ఖరీదైన కెమెరా కొనిచ్చారు. అయితే ఆ కెమెరాపై కన్నేసిన ఇద్దరు యువకులు దాన్ని సొంతం చేసుకోవడం కోసం కుట్ర పన్నారు. షూటింగ్ ఉందని నమ్మించి తమ వద్దకు పిలిపించుకుని కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన రావులపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 

విశాఖపట్నంలోని మధురవాడ దగ్గర బక్కన్నపాలెం గ్రామానికి చెందిన పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ (23) ఇంటర్మీడియట్ వరకూ చదివాడు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ గా స్థిరపడ్డాడు. స్థానికంగా ఫోటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తండ్రి శ్రీను ఆటోడ్రైవర్ గా పని చేస్తున్నారు. తల్లి రమణమ్మ ఫ్యాన్సీ షాప్ నడుపుతున్నారు. కొడుకు ఫోటోగ్రాఫర్ గా సెటిల్ అవుతానంటే 15 లక్షలు అప్పు చేసి మరీ కెమెరా కొని ఇచ్చారు. దీంతో సాయి ఆ కెమెరాతోనే మూడేళ్ళుగా సొంతంగా వేడుకలను చిత్రీకరిస్తూ వస్తున్నాడు. వాట్సాప్ ద్వారా దూర ప్రాంతాల వారు ఎవరైనా బుకింగ్ చేసుకుంటే వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలోనే గత నెల 24న ఆన్ లైన్ ద్వారా పోతుల షణ్ముఖ తేజ (19) అనే కుర్రాడు పరిచయమయ్యాడు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానానికి చెందిన షణ్ముఖ తేజ.. రావులపాలెంలో పెళ్లి వేడుకను షూట్ చేసేందుకు రావాలని సాయిని కోరాడు. తాను చిన్న చిన్న వేడుకలకు వీడియోలు, ఫోటోలు తీస్తుంటానని.. తన దగ్గర ఉన్న కెమెరా క్వాలిటీ అంత బాలేదని.. నీ కెమెరా పెద్దది కాబట్టి దాంతో షూట్ చేస్తే అవుట్ పుట్ బాగా వస్తుంది, డబ్బులు కూడా బాగా వస్తాయని నమ్మించాడు షణ్ముఖ తేజ. అది నమ్మిన సాయి తన కెమెరాతో గత నెల 26న రావులపాలెం వెళ్ళాడు. షణ్ముఖ తేజ తనకు తెలిసిన కారు డ్రైవర్ వినోద్ ని పిలిచాడు. ఈ వినోద్ అనే వ్యక్తి కడియం మండలం పొట్టిలంకకు చెందిన వాడు. షూటింగ్ లొకేషన్ కి కారులో వెళ్దామని కారు ఎక్కించుకున్నారు. సాయి కారు ముందు సీట్లో కూర్చున్నాడు.

అయితే షూటింగ్ లొకేషన్ కి కాకున్నా రావులపాలెం పరిసర ప్రాంతాల్లో తిప్పుతూ వచ్చారు. దీంతో సాయికి అనుమానం వచ్చింది. కారు నంబర్ ఫోటో తీసి తల్లికి పంపించాడు. తాను పరిచయం లేని వారితో ఉన్నానని.. ఒకవేళ తన ఫోన్ కలవకపోతే ఈ నంబర్ కి ఫోన్ చేయండి అంటూ తల్లికి షణ్ముఖ తేజ నంబర్ పంపించాడు. కడియం మండలం వేమగిరి చేరుకోగానే కారులో వెనుక నుంచి సీటు బెల్టుతో గొంతు నులిమి చంపేశాడు షణ్ముఖ తేజ. అనంతరం సాయి మృతదేహాన్ని గోదావరిలో పూడ్చి పెట్టారు. మూడు రోజులైనా తమ కొడుకు ఇంటికి రాకపోవడం.. ఫోన్ చేయకపోవడంతో అనుమానంతో తల్లిదండ్రులు గత నెల 29న పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి పంపించిన ఫోన్ నంబర్, కారు నంబర్ ఫోటో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఫోన్ నంబర్ ని ట్రేస్ చేసి షణ్ముఖ తేజ రాజమండ్రిలో ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కాల్ డేటా పరిశీలించారు. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంకు చెందిన యువతితో షణ్ముఖ తేజ ఎక్కువ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఇంటికి వెళ్లి యువతి ఫోన్ నుంచి షణ్ముఖ తేజతో చాటింగ్ చేయించి ఎక్కడున్నాడో అడిగారు. దీంతో షణ్ముఖ తేజ అన్నవరంలో ఉన్నట్లు యువతికి మెసేజ్ చేశాడు. వెంటనే పోలీసులు అన్నవరం వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తాను కోటీశ్వరుడినని.. ఫోటోగ్రఫీకి సంబంధించిన లక్షల విలువ చేసే పరికరాలు తన వద్ద ఉన్నాయని చాటింగ్ ద్వారా డబ్బున్న అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అయితే ఆ యువతి ఆ పరికరాలు చూపించమని అనడంతో షణ్ముఖ తేజ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇక మరొక నిందితుడు వినోద్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి