iDreamPost

ఆడ పిల్లలు అమ్మకు, అత్తకు బానిసలు కాదు : హైకోర్టు

మహిళలకు/ భార్యలకు ఓ మనస్సు ఉంటుందని, వారి అభిప్రాయాలకు విలువ ఉంటుందని ఇంట్లో మనుషులు గుర్తించడం లేదు. దీంతో సమస్య కోర్టు వద్దకు వెళుతోంది భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చినా కూడా మహిళపైనే నిందలు వేస్తుంటారు పుట్టింటి, అత్తింట్లోని మనుషులు. కానీ కోర్టుకు అందరూ సమానులే. వాస్తవాలను గ్రహించి.. తీర్పులు ఇస్తూ.. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.

మహిళలకు/ భార్యలకు ఓ మనస్సు ఉంటుందని, వారి అభిప్రాయాలకు విలువ ఉంటుందని ఇంట్లో మనుషులు గుర్తించడం లేదు. దీంతో సమస్య కోర్టు వద్దకు వెళుతోంది భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చినా కూడా మహిళపైనే నిందలు వేస్తుంటారు పుట్టింటి, అత్తింట్లోని మనుషులు. కానీ కోర్టుకు అందరూ సమానులే. వాస్తవాలను గ్రహించి.. తీర్పులు ఇస్తూ.. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.

ఆడ పిల్లలు అమ్మకు, అత్తకు బానిసలు కాదు : హైకోర్టు

కొన్నాళ్లుగా కోర్టులిస్తున్న తీర్పులు చూస్తుంటే వింతగా అనిపించినా ఆదర్శంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు అనుకూలంగా తీర్పులు రావడం గమనార్హం. కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమలలోకి మహిళల ప్రవేశం దగ్గర నుండి ఇటీవల 26 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతినివ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చడం వరకు పలు కీలక తీర్పులు వచ్చాయి. అలాగే మహిళలపై అత్యాచార, హత్య కేసుల్లో నిందితులను ఉపేక్షించడం లేదు న్యాయ స్థానాలు. వారికి జీవిత ఖైదు లేదంటే పెద్ద సంఖ్యలో జైలు జీవితం, ఉరి శిక్ష వంటివి విధిస్తున్నాయి. ఇంకా న్యాయం బతికే ఉందన్న ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందిస్తున్నాయి. తాజాగా ఆడ పిల్లలకు సంబంధించి ఓ కోర్టు కీలక తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో తల్లి, అత్తలను చీవాట్లు పెట్టింది. ఇంతకు ఏం జరిగిందంటే..?

ఓ మహిళా విడాకుల కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆడ పిల్లలు వారి అమ్మలకు, అత్తలకు బానిసలు కాదు అంటూ చీవాట్లు పెట్టింది. ఓ మహిళా విడాకుల కేసును ఫ్యామిలీ కోర్టు కొట్టేయగా.. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు సరైనవి కావని, అది పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మహిళలు తీసుకునే నిర్ణయాలు.. అత్త, అమ్మ కంటే తక్కువ కాదూ అంటూ పేర్కొన్నారు. ఈ సమస్యపై గురించి బాధిత మహిళ తన అమ్మ, అత్త చెప్పేది వినాలంటూ కుటుంబ న్యాయస్థానం చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు భర్త తరుఫు న్యాయవాది.

మహిళ నిర్ణయాలు.. తల్లి లేదా అత్త కంటే తక్కువగా పరిగణించలేమని రామచంద్రన్ అన్నారు. మహిళలు తమ తల్లులకు, అత్తలకు బానిసలు కాదూ అని తేల్చి చెప్పారు. ఇది పితృస్వామ్య వ్యవస్థను పెంచి పోషిస్తుందని, ఈ రోజుల్లో ఇలాంటి తీర్పు రాకూడదని అన్నారు. వివాదాలను సులభంగా పరిష్కరించుకోవచ్చునని, కోర్టు బయట సమస్యను సాల్వ్ చేసుకోవచ్చునని భర్త తరుఫు న్యాయవాది విన్నవించగా.. ఆ మహిళ కూడా దాన్నే కోరుకుంటే కోర్టు బయటే సెటిల్ మెంట్ చేసేందుకు తాను సిద్ధమేనని అన్నారు. ఆమెకంటూ ఓ మనస్సు ఉందని, ఆమెను కట్టడి చేసేందుకు మధ్యవర్తిత్వం చేస్తారా అంటూ ప్రశ్నించింది. ఆమె మనస్సును బాధపెట్టి ఉండటం వల్లే.. ఆమె విడిపోవాలని అనుకుంటుందని, భార్యతో మంచిగా మెలగాలని భర్తకు చీవాట్లు పెట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి