iDreamPost

బిల్లు కట్టకుండా తప్పించుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

బిల్లు కట్టకుండా తప్పించుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సాధారణంగా షాపుల్లో వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత కొంత మంది వ్యక్తులు బిల్లు కట్టకుండా తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. అదేవిధంగా హోటళ్లలో కూడా తిన్న తర్వాత బిల్ కట్టకుండా పారిపోయోందుకు ఆలోచిస్తుంటారు. అలా తప్పించుకున్న వారిని పట్టుకుని డబ్బును వసూలు చేయడమో లేక పని చేయించుకోవడమో చేస్తుంటారు నిర్వాహకులు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో దెబ్బలు కూడా పడాల్సి వస్తుంది. ఇదే రీతిలో ఓ మహిళ ఓ షాప్ కు వెళ్లి తనకు కావాల్సిన వేల రూపాయల వస్తువులను కొనుగోలు చేసి తాను సుప్రీంకోర్టు లాయర్ భార్యను అని చెప్పి, బిల్ ఇంటికి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరింది. సరిగ్గా ఇక్కడే తన ప్లాన్ అమలు పరిచింది. ఆమె ఇంటి అడ్రస్ ను తప్పుగా ఇచ్చి షాపు నుంచి బయటపడ్డది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

గ్రేటర్ నోయిడాలో ఓ మహిళ తాను కొన్న వస్తువులకు బిల్ కట్టకుండా తప్పించుకున్న వ్యవహారంలో షాప్ నిర్వాహకులు ఆమె ఇంటికెళ్లి పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె చేసిన మోసానికి సంబంధించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..గ్రేటర్ నోయిడాలో ఓ మహిళ షాప్ కు వెళ్లి రూ. 15000 లు విలువ చేసే వస్తువులను కొనుగోలు చేసింది. ఇక బిల్ కట్టే సమయానికి ఓ ప్లాన్ రెడీ చేసుకుంది. తాను సుప్రీంకోర్టు లాయర్ భార్యనని, ఇంటికి వచ్చి బిల్ తీసుకోవాల్సిందిగా కోరింది.

ఈ క్రమంలో ఇంటి అడ్రస్ తప్పుగా ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత షాప్ నిర్వాహకులు బిల్ వసూల్ చేసేందుకు ఆమె ఇచ్చిన అడ్రస్ కు వెళ్లి ఖంగుతిన్నారు. ఆమె అడ్రస్ తప్పుగా ఇచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎలాగోలా అడ్రస్ తెలుసుకుని చివరికి ఆమెను పట్టుకున్నారు. కాగా తప్పు చేసిన తనను క్షమించాలని కోరింది. ఇదంతా వీడియో తీస్తున్న సమయంలో ఆమె తన ముఖాన్ని చేతులతో అడ్డుపెట్టుకుని కప్పుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి