iDreamPost

కుమారుడ్ని వివాహం చేసుకున్న మహిళా.. తిట్టిపోస్తున్న స్థానికులు

తెలుగులో మూడు ముళ్ల బంధం అనే సినిమా ఉంది. అందులో హీరోయిన్ మాధవికి పెళ్లి కుదురుతుంది. వరుడికి చిన్న తమ్ముడు ఉంటాడు. పెళ్లిలో కరెంట్ షాక్ కొట్టి వరుడు చనిపోతే.. వధువు అయిన మాధవికి శాపనార్థాలు పెడుతుంటారు బంధువులు. ఆ మాటలు విన్న చిన్ననాటి రాజేంద్ర ప్రసాద్ ఆమె మెడలో తాళికడతాడు. ఆమె అతడిని నిజమైన భర్తగా భావిస్తుంది.. పెంచి, పెద్ద చేస్తుంది.. కానీ చివరకు కథ వేరోలా ఉంటుంది. ఈ తరహాలోనే..

భార్యా భర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన జంట.. బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ, నాన్న అనే పిలుపు కోసం ఆరాటపడుతుంటారు. అయితే కొన్ని అనివార్య కారణాలు, అనారోగ్య సమస్యలు వెరసి.. కొంత మందికి పిల్లలు పుట్టరు. పిల్లల కోసం యాగాలు, వ్రతాలు చేయడంతో పాటు ఆసుపత్రులు తిరుగుతుంటారు. అయితే సహృదయం ఉన్నవాళ్లైతే.. అనాథ పిల్లలను దత్తత తీసుకుని, తమ పిల్లలుగా భావించి పెంచి, పెద్ద చేస్తారు. ప్రయోజకులను చేస్తుంటారు. వారికి మరొక బిడ్డ కలిగినా.. ఆ బిడ్డలను తమ సొంత పిల్లల్లాగే చూసుకుంటారు. అయితే తాము పెంచిన పిల్లల్ని.. మనువాడాలని ఎవరైనా భావిస్తారా..? వినడానికే జుగుప్పకరంగా ఉన్న.. ఓ మహిళ మాత్రం నిజం చేసి చూపింది.

ఇదే కథాంశంతో తెలుగులో బావ బావ పన్నీరు సినిమా వచ్చింది. కోటా శ్రీనివాసరావు.. కూతరు వయస్సు ఉన్న అమ్మాయిని దత్తత తీసుకుని పెళ్లి చేసుకువాలనుకుంటాడు. కానీ చివరకు బెడిసికొడుతుంది. అయితే ఇక్కడ సీన్ రివర్స్. ఓ అబ్బాయిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకుందో మహిళ. ఈ విస్తుగొలిపే ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఆ మహిళ వయస్సు 53 సంవత్సరాలు కాగా, అతడి వయస్సు 22 సంవత్సరాలు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. రష్యాలోని టాటర్ స్టాన్ ప్రాంతానికి చెందిన ఐసీలు చిజెవ్‌స్కాయా-మింగలిమ్ సంగీత విద్వాంసురాలు. కొన్నాళ్ల క్రితం అనాథ ఆశ్రమంలో సంగీత పాఠాలు నేర్పేందుకు వెళ్లింది. ఆ సమయంలో 13 ఏళ్ల బాలుడ్ని డేనియల్‌ సంగీతం పట్ల ఆసక్తితో ఉండటంతో అతడికి దగ్గరయ్యింది. అతడికి మంచి శిక్షణనిచ్చింది.

ఆమె సాయంతో సంగీతం నేర్చుకున్న డేనియల్.. అనేక షోల్లో తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించాడు. ఈ క్రమంలో అతడిని 14 ఏళ్ల వయస్సులో దత్తత తీసుకుంది ఐలు. అప్పటి నుండి వారిద్దరు కలిసి జీవిస్తున్నారు. అయితే అక్టోబర్ 20వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో స్థానికులే కాదూ.. ప్రపంచం మొత్తం విస్తుపోయింది. ఆమె నిర్ణయాన్ని తిట్టిపోస్తున్నారు. అయితే తమ రిలేషన్ షిప్, పెళ్లిపై ఐలు స్పందించినట్లు తెలుస్తోంది. తమ మధ్య ఉన్న సంబంధంపై పలు పుకార్లు పుట్టాయని, వాటిని నిజం చేసేందుకు పెళ్లి చేసుకున్నామని పేర్కొంది. తమ వివాహం ఆధ్యాత్మికమైనదని, భౌతికమైనది కాదని ఆమె స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి