iDreamPost

కిలేడీ.. నిర్మలా సీతారామన్, RBI పేర్లు చెప్పి రూ.17 కోట్లు..!

బతికేందుకు మార్గాలు అన్వేషించడం పోయి.. మోసం చేసేందుకు మార్గాలను వెతుకుతున్నారు కొంత మంది మోసగాళ్లు. ఈజీ మనీ, జల్సాల కోసం అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఇందులో తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు కొంత మంది మహిళలు.

బతికేందుకు మార్గాలు అన్వేషించడం పోయి.. మోసం చేసేందుకు మార్గాలను వెతుకుతున్నారు కొంత మంది మోసగాళ్లు. ఈజీ మనీ, జల్సాల కోసం అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఇందులో తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు కొంత మంది మహిళలు.

కిలేడీ.. నిర్మలా సీతారామన్, RBI పేర్లు చెప్పి రూ.17 కోట్లు..!

మంచికి రోజులు లేవమ్మ అంటూ ఉంటారు పెద్దలు. ఇవిగో ఇలాంటి సంఘటనలు చూస్తుంటే నిజమే అనిపించకమానదు. అమాయకుల్ని బురిడీ కొట్టించి మోసానికి పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇందులో పురుషులతో పాటు మహిళలు ఆరితేరిపోయారు. పెద్ద పెద్ద వాళ్లు తెలుసుకుంటూ, మీకు ఆ పని చేసి పెడతాం, మీకు ఈ పని అయిపోతుంది అంటూ మాయ మాటలు చెబుతూ.. డబ్బులు తీసుకుంటున్నారు. అనంతరం పరారవుతున్నారు. ఆరా తీస్తే కానీ.. అసలు విషయం వెలుగులోకి వస్తుంది. అప్పుడు మా డబ్బులు పోయాయంటూ లబో దిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. పోలీసులు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా.. వినిపించుకోకుండా..డబ్బు కోసం ఆశ పడి.. అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు.

ఇదిగో ఈమె మామూలు మహిళ కాదూ.. ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేరిట వందలాది మందిని మోసం చేసింది. రూ. 17 కోట్ల మేర మాయం చేసింది. వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తానంటూ.. ఈ మహిళ చాలా మంది దగ్గర నుండి డబ్బులు తీసుకుని పరారయ్యింది. ఎట్టకేలకు ఆమెను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన పవిత్ర అనే మహిళ బ్లూ వింగ్స్ పేరుతో ట్రస్ట్ నడుపుతోంది. తమిళనాడు, బెంగళూరు శివార్లలోని అతిబెలె, హోసూర్, ధర్మపురిలోని ప్రజలను కలిసి కట్టుకథ అల్లడం ప్రారంభించింది.

తన సంస్థకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు రూ. 17 కోట్లు ఆర్భీఐ మంజూరు చేసిందని, మీకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. వారిని నమ్మించేందుకు నిర్మలా సీతారామన్ సంతకంతో కూడిన లేఖ, డబ్బు కట్టల వీడియోనూ చూపించింది. అయితే రుణం పొందాలంటే.. ముందుగా రూ. 25 వేలు, రూ. 30 వేలు అడ్వాన్స్ చెల్లించాలని పేర్కొంది. నమ్మిన జనం ఆమెకు డబ్బులు ఇవ్వడం స్టార్ చేశారు.  అలా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 500 మందికి పైగా వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసింది. కానీ ఆ తర్వాత అప్పు ఇవ్వలేదు.. అడ్వాన్స్ డబ్బులు తిరిగి చెల్లించలేదు పవిత్ర. అడిగితే.. మీరేం చేసుకుంటారో.. చేసుకోండి అంటూ బెదిరించడం మొదలు పెట్టింది. మోసపోయామని గ్రహించాక.. పోలీసులకు ఫిర్యాదు చేశారు జనాలు. పోలీసులు మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేశారు. పవిత్రతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి