iDreamPost

కదులుతున్న కారులో మహిళ, ఆరేళ్ల కూతురిపై సామూహిక అత్యాచారం

కదులుతున్న కారులో మహిళ, ఆరేళ్ల కూతురిపై సామూహిక అత్యాచారం

తల్లి-కూతురిపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా రూర్కీలో జరిగింది. శుక్రవారం (జూన్ 24) రాత్రి మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు పిరాన్ కలియార్ అనే ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే దారిలో కారులో వెళ్తున్న కొందరు యువకులు మహిళకు, ఆమె కూతురికి లిఫ్ట్ ఇస్తామని నమ్మించి తమ కారులో ఎక్కించుకున్నారు. కదులుతున్న కారులోనే తల్లి- కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిద్దరినీ ఓ కాలువ వద్ద వదిలి పరారయ్యారు.

స్పృహలోకి వచ్చాక ఆ మహిళ తన కూతురితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని జరిగిన ఘటనను తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తల్లి – కూతురిపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా.. బాధితురాలు తమపై ఎందరు అత్యాచారానికి పాల్పడ్డారో స్పష్టంగా చెప్పలేకపోతోంది. కారు డ్రైవర్ పేరు మాత్రం సోను అని తెలిపింది. ప్రస్తుతం తల్లి-కూతురు అధికారుల పర్యవేక్షణలో ఉన్నారు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తులపై రూర్కీలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో, ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ లోని సెక్షన్ 376 (రేప్), పిల్లల రక్షణ చట్టంలోని లైంగిక నేరాలకు వ్యతిరేకంగా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి