iDreamPost

రాజీ పడతారా – రామని చెబుతారా

రాజీ పడతారా – రామని చెబుతారా

రాజమౌళికి అమరేంద్ర బాహుబలి తరహాలో పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇప్పటికే కిందామీదా పడుతూ వాయిదాల మీద వాయిదాలు తింటూ షూటింగ్ కొనసాగిస్తూ వచ్చిన ఆర్ఆర్ఆర్ కు కరోనా రూపంలో మరొక మెగా బ్రేక్ అడ్డు పడింది. ఒకటి కాదు ఏకంగా రెండు నెలల విలువైన సమయాన్ని తినేస్తోంది. జులైకాంతా పరిస్థితి నార్మల్ కావొచ్చని అంటున్నారు కానీ భారీ జన సందోహం గుమికూడే షూటింగులకు ప్రభుత్వాలు అప్పటి నుంచైనా అనుమతి ఇస్తాయా లేదా అన్నది పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా జీరో అవ్వడం మీద ఆధారపడి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ విడుదల వచ్చే ఏడాది జనవరి 8 అని ప్రకటించేశారు.

అలియా భట్ పార్ట్ ఇంకా బాలన్స్ ఉంది. యూరోప్, బ్రిటన్ నటీనటులు పాల్గొనాల్సిన కొన్ని కీలకమైన సన్నివేశాలు బాలన్స్ ఉన్నాయి. వేరేవాళ్లను రీ ప్లేస్ చేయడానికి లేదు. ఆల్రెడీ కొంత భాగం తీసేశారు కాబట్టి రీ షూట్ అసాధ్యం. విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఇంకో నాలుగు నెలలు వీసా ప్రాసెసింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు.
ఇదంతా ఒక ఎత్తైతే గ్రాఫిక్ వర్క్ చేయాల్సిన సంస్థలు ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్నాయి. వర్క్ ఆగిపోయింది. ఇదంతా ఇళ్లలో జరిగే వ్యవహారం కాదు. ఈ ఎక్విప్మెంట్ ఎవరి దగ్గరా ఉండదు.

కరోనా రాకపోయి ఉంటే ఈపాటికి షూటింగ్ పూర్తయిన భాగానికి విజువల్ ఎఫెక్ట్స్ ఫినిష్ చేసేవాళ్ళు. ఇదంతా మాటల్లో చెప్పుకునేంత ఈజీ వ్యవహారం కాదు. ఇంకా లేట్ అయితే మాత్రం ఆర్ఆర్ఆర్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే 2021 సమ్మర్ తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. ఒకవేళ రాజీ పడి వేరే ఆర్టిస్టులతో ఆ మిగిలిన పార్ట్ తీసి గ్రాఫిక్ వర్క్ ఇండియాలోనే చేయించుకుంటే క్వాలిటీ తగ్గే ప్రమాదం ఉంది. రాజమౌళి దానికి ససేమిరా అంటారు. ఈ లెక్కన చూస్తుంటే ఆర్ఆర్ఆర్ మరోసారి పోస్ట్ పోన్ తప్పదనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. అదే కనక జరిగితే ఆర్ఆర్ఆర్ బదులు సంక్రాంతికి ఏ భారీ సినిమాలు వస్తాయనే ఆసక్తి మూవీ లవర్స్ లో మొదలవుతుంది. చూద్దాం ఏమవుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి