iDreamPost

మృగశిర కార్తెలో చేపలు ఎందుకు తింటారు ? ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చేపలు తినొచ్చా ?

మృగశిర కార్తెలో చేపలు ఎందుకు తింటారు ? ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చేపలు తినొచ్చా ?

మృగశిర కార్తె వరకూ మండుటెండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతారు. మృగశిర కార్తె రాకతో.. ఎండల తీవ్రత కాస్త తగ్గడంతో.. ఉపశమనం లభించినట్లు ఫీలవుతారు. ప్రతి ఏటా వేసవికాలంలో 15 రోజుల పాటు మృగశిర కార్తె ఉంటుంది. చాలామంది మృగశిర కార్తె రోజున చేపలు తింటారు. ఎందుకు ?

మృగశిరకార్తె రోజున చేపలు ఎందుకు తింటారన్న విషయం చాలామందికి తెలియదు. ఏదో తినాలి అంటారు కాబట్టి తినేస్తారు. మృగశిర కార్తె రాకతో వాతావరణంలో కొంతమార్పు జరుగుతుంది. బయట ఉష్ణోగ్రతతో పాటు మన శరీర ఉష్ణోగ్రత కూడా స్వల్పంగా తగ్గుతుంది. దీంతో శరీరంలో వేడిని మెయింటెయిన్ చేసి ఆరోగ్య సమస్యలు రాకుండా చేపలు సహకరిస్తాయి కాబట్టి.. మృగశిరకార్తెలో చేపలు తినాలని అంటారు.

అలాగే.. వేసవికాలం తర్వాత కురిసే వర్షాల కారణంగా చాలామంది అనారోగ్యంబారిన పడుతుంటారు. జలుబు, దగ్గు, జ్వరంతోపాటు జీర్ణ సమస్యలు కూడా ఉంటాయి. శరీర రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఇలా సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు చేపాహారం తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో ఉండే పోషకాలు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా తోడ్పడతాయి. చేపల్లో విటమిన్స్ ఎ, డి, ఇ, కే లతో పాటు థయామిన్, రిబోఫ్లేవిన్, నియోసిన్లు, ఐరన్ కంటెంట్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిగిన ఉన్న చేపల్ని తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. మెదడు ఎదుగుదలకు కూడా చేపలు ఉపయోగపడతాయి. రక్తవృద్ధికి కారణమయ్యే హిమోగ్లోబిన్ కూడా చేపల ద్వారా లభిస్తుంది.

చేపల్లో ఉండే కొవ్వు మనశరీరంలో రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటిచూపుకు మేలు చేస్తాయి. ఆస్తమా పేషంట్స్ చేపలను తీసుకోవడం చాలా మంచిదంటున్నారు వైద్యులు. అలాగే తాజా చేపల్ని తినడం వల్ల చర్మకాంతి కూడా మెరుగవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చేపల్ని తినడం చాలా మంచిది. గర్భం దాల్చినపుడు చేపాహారం తీసుకోవడం.. కడుపులో పెరిగే పిల్లలకు కూడా మంచిదని వైద్యులు చెప్తున్నారు.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి