iDreamPost

అవినీతి, అక్రమార్కుల అరెస్టులు తప్పేంటీ..?: ఎన్‌హెచ్‌ఆర్సీకి టిడిపి ఎందుకు ఫిర్యాదు చేసిందీ..?

అవినీతి, అక్రమార్కుల అరెస్టులు తప్పేంటీ..?: ఎన్‌హెచ్‌ఆర్సీకి టిడిపి ఎందుకు ఫిర్యాదు చేసిందీ..?

అమాయకులను అన్యాయంగా అరెస్టు చేస్తే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. న్యాయం కోసం అలా ఫిర్యాదు చేయడం కూడా సబబే. కాని రాష్ట్రంలో టిడిపి అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. అవినీతి, అక్రమాలు చేసిన వారిని అరెస్టు చేస్తే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అంటే టిడిపిలో పరిభాషలో అవినీతి, అక్రమాలు చేయడం తప్పుకాదు కదా..! అలాగే అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయకూడదా..!

అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలనే రాజకీయ పార్టీలను చూశాం. కాని అలాంటి వారిని అరెస్టు చేయకూడదనే పార్టీ మాత్రం టిడిపినే. అవినీతి, అక్రమాలు చేసేవారిని అరెస్టు చేయడమే తప్పన్నట్లు టిడిపి‌ వ్యవహరిస్తుంది. దానికి కొన్ని తోక పార్టీలు సై అంటున్నాయి. అలాగే టిడిపి‌ అనుబంధ మీడియా అయితే అవినీతి, అక్రమాలు పాల్పడినా పర్వాలేదు, కాని అరెస్టు చేయడం ఏంటీ, అది ఎంతో అన్యాయం అన్నట్లు గగ్గోలు పెడుతుంది.

అవినీతి, అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడంపై తెలుగుదేశం నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సి)కు ఫిర్యాదు చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టుపై టిడిఎల్పీ ఉప నేత రామానాయుడు, జెసి ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి అరెస్టులపై ఎమ్మెల్సీ గౌరవాణి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు.

అయితే టిడిపి నేతలకు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి మానవ హక్కుల కమిషన్ గుర్తుకొచ్చింది. నాడు అధికారంలో ఉన్నప్పుడు టిడిపి ఎంత అన్యాయంగా వ్యవహరించిందో అందరికి తెలుసు. అమాయకులను, ప్రతిపక్ష నేతలను వివిధ సందర్భాలలో అన్యాయంగా వందల‌ సంఖ్యలో అరెస్టు‌ చేశారు.‌ ప్రత్యేక హోదా అడిగినందుకు వందలాది చదువుకున్న విద్యార్థులపై కేసులు‌ నమోదు చేశారు. ఆ రోజు మానవ హక్కుల గుర్తుకు రాలేదు. ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. మానవ హక్కుల ఉల్లంఘన గుర్తుకు రాలేదు.

సిఎం వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి అమాయకులపైన, చదువుకున్న విద్యార్థులపైన ఉన్న కేసులు కొట్టివేసి…అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై విరుచుకుపడుతున్నారు. అందులో భాగంగానే వందల కోట్ల ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆధారాలతో అరెస్టు చేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. అదేదో పాపం అన్నట్లు టిడిపి నేతలు, టిడిపి అనుబంధ ఎల్లో మీడియా గగ్గోలు పెడుతుంది. మానవ హక్కులు గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి