iDreamPost

నిమ్మగడ్డ లేఖ దర్యాప్తు పై చంద్రబాబుకు ఎందుకు ఉలికిపాటు ?

నిమ్మగడ్డ లేఖ దర్యాప్తు పై చంద్రబాబుకు ఎందుకు ఉలికిపాటు ?

ఎలక్షన్ కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో కేంద్ర హోంశాఖకు వెళ్ళిన లేఖపై చంద్రబాబునాయుడు ఇపుడు ఉలికిపడుతున్నాడు. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖపై దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాలంటూ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై చంద్రబాబుతో పాటు టిడిపిలో కూడా టెన్షన్ మొదలైనట్లే ఉంది. స్ధానికసంస్ధల ఎన్నికల వాయిదా అంశం ఎంత వివాదం రేగిందో అందరూ చూసిందే. ఆ తర్వాత నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ఓ లేఖ అందింది. నిజానికి ఆ లేఖలో ప్రభుత్వ ఇమేజికి బాగా డ్యామేజింగ్ గానే ఉంది.

లేఖ అంశం బయటపడినపుడు పెద్ద సంచలనమే జరిగింది. ఏఎన్ఐ వార్తా సంస్ధతో నిమ్మగడ్డ మాట్లాడుతూ తాను ఆ లేఖను రాయలేదని స్పష్టం చేశాడు. సరే రెండు రోజుల తర్వాత వివాదం సద్దుమణిగిందనే అనుకున్నారు అందరు. కాన అనూహ్యంగా నెల రోజుల తర్వాత విజయసాయిరెడ్డి ఆ లేఖపై దర్యాప్తు చేయలంటూ డిజిపికి ఫిర్యాదు చేశాడు. అందులో ముగ్గురు నేతలపై ఎంపి ఆరోపణలు కూడా చేశాడు. సరే ఆ ఫిర్యాదుపై పోలీసులు ఏమి చేస్తారో చూడాలి.

అయితే ఎంపి ఫిర్యాదుపై తాజాగా చంద్రబాబు ఉలికిపడుతున్నాడు. కేంద్ర హోంశాఖకు తానే లేఖ రాసినట్లు నిమ్మగడ్డ ప్రకటించిన తర్వాత వైసిపి ఆ విషయంపై ఎందుకు రాద్దాంతం చేస్తోందంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మండిపడుతున్నాడు. విజయసాయి ఫిర్యాదు చేయటమేంటి ? పోలీసులు దర్యాప్తు చేయటమేంటి ? అంటూ చంద్రబాబు ఊగిపోతున్నాడు. చంద్రబాబు ఉలికిపాటు చూస్తుంటే ఎంపి తన ఫిర్యాదులో చెప్పినట్లు టిడిపి రాజ్యసభ ఎంపి కనకమేగల రవీంద్రకుమార్, సీనియర్ నేతలు టిడి జనార్ధన్ రావు, వర్ల రామయ్య తగులుకుంటారనే టెన్షన్ పెరిగిపోతోందా ? అనే అనుమానం పెరిగిపోతోంది.

పై ముగ్గురు నేతలే నిమ్మగడ్డ పేరుతో లేఖను తయారు చేశారని, నిమ్మగడ్డ సంతకాన్ని పోర్జరీ చేశారనేది విజయసాయిరెడ్డి ప్రధాన ఆరోపణ. పైగా ఆ లేఖను గుంటూరులోని టిడిపి కార్యాలయంలో తయారు చేశారని కూడా తన ఫిర్యాదులో చెప్పాడు. నిజానికి పోలీసులు గట్టిగా దర్యాప్తు చేస్తే ఎవరి ఐపి అడ్రస్ నుండి కేంద్ర హోంశాఖకు మెయిల్ లో లేఖ వెళ్ళిందో తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే నిమ్మగడ్డ సంతకాల్లో కూడా తేడా కనబడుతోంది. లేఖ అంశాన్ని అందరు మరచిపోయారని అనుకున్న సమయంలో హఠాత్తుగా విజయసాయి ఫిర్యాదు చేయటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారేమో ?

నిమ్మగడ్డ లేఖలో ప్రభుత్వ ఇమేజికి డ్యామేజి జరిగినపుడు హ్యాపీగా ఫీలైన ఇదే చంద్రబాబు అదే లేఖపై లోతుగా దర్యాప్తు చేయాలనే ఫిర్యాదుతో ఎందుకు ఉలికిపడుతున్నాడు ? ఫిర్యాదు చేసింది విజయసాయి కాబట్టి పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తారన్న విషయం చంద్రబాబు అండ్ కో కు అర్ధమైపోయినట్లుంది. దర్యాప్తులో తీగతో పాటు మొత్తం డొంకంతా బయటపడుతుందనే ఇపుడు అందరూ ఉలికిపడుతున్నట్లు అర్ధమైపోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి