iDreamPost

చంద్రబాబుకు సోషల్ మీడియా స్క్రిప్ట్ రైటర్లు ఎందుకు?

చంద్రబాబుకు సోషల్ మీడియా స్క్రిప్ట్ రైటర్లు ఎందుకు?

ఇపుడిదే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సర్వకాల సర్వావస్ధల్లోను చంద్రబాబునాయుడు రక్షణ కోసమే పనిచేసే ఎల్లోమీడియా ఎంత బలంగా ఉండేదో అందరికీ తెలిసిందే. నిజానికి చంద్రబాబు బలమే మీడియా. ప్రత్యర్ధుల బలహీనలతనే తన బలంగా చంద్రబాబు మార్చుకుని రాజకీయాలు చేయటంలో ఎల్లోమీడియాదే ప్రధాన పాత్ర. అలాంటి చంద్రబాబు కూడా ’సోషల్ మీడియా స్క్రిప్ట్ రైటర్లను పెట్టుకుంటా’ నని అన్నాడంటే అర్ధమేంటి ?

నిజానికి మెయిన్ మీడియాను సోషల్ మీడియా ఎప్పుడో డామినేట్ చేసేసింది. మీడియా పార్టీల వారీగా, కులాల వారీగా చీలిపోయిన నేపధ్యంలో సోషల్ మీడియా దాదాపు పదేళ్ళ క్రితమే ప్రాధాన్యత సంతరించుకున్నది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావటంలో టిడిపి తరపున పనిచేసిన సోషల్ మీడియాదే ప్రధాన పాత్రన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సీన్ రివర్సయి అదే సోషల్ మీడియా 2019లో జగన్మోహన్ రెడ్డికి బలంగా మద్దతు పలికింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబుకు పార్టీ తరపున ఏర్పాటైన సోషల్ మీడియా ఏర్పాటైంది కాబట్టే పార్టీ అధికారంలోకి రాగానే కనుమరుగైపోయింది. అదే వైసిపికి మద్దతుగా ఉన్న సోషల్ మీడియా విషయాన్ని తీసుకుంటే జగన్ పై ఉన్న అభిమానంతోనే వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వేలాది ఎకౌంట్లు ఏర్పాటయ్యాయి. ఇటువంటి సోషల్ మీడియా జగన్ కు అండగా ఉండబట్టే ఎల్లోమీడియా ఆటలు సాగటం లేదు.

జగన్ పై ఉద్దేశ్యపూర్వకంగా ఎల్లోమీడియా ఎంతగా విషప్రచారం చేస్తున్నా జగన్ కు మద్దతుగా ఉంటున్న సోషల్ మీడియా తిప్పికొడుతోంది. గడచిన పది మాసాల జగన్ పాలనలో చంద్రబాబు అండ్ కో లేదా ఎల్లోమీడియా చేస్తున్న ఆరోపణలను చీల్చి చెండాటంలో వైసిపి సోషల్ మీడియానే చాలా స్పీడుగా ఉంది. కాబట్టి జనాలకు అసలు వాస్తవాలేంటో చాలా వివరంగా చేరుతున్నాయి. మొత్తానికి ఇంత కాలానికి తనకు మద్దతుగా నిలబడిన మీడియా రాతలను జనాలు నమ్మటం లేదన్న విషయం చంద్రబాబుకు అర్ధమైనట్లుంది. అందుకనే సొంతంగానే సోషల్ మీడియా స్క్రిప్ట్ రైటర్లను పెట్టుకుంటానని చెప్పాడు. చూద్దాం స్క్రిప్ట్ రైటర్లు ఏమి చేస్తారో ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి