iDreamPost

Saurabh Kumar: దశాబ్ద కాలం నిరీక్షణ.. 30 ఏళ్లకు టీమిండియాలోకి! ఎవరీ సౌరభ్ కుమార్?

సౌరభ్ కుమార్.. ప్రస్తుతం భారత క్రికెటర్ లో చర్చనీయాంశంగా మారిన పేరు. దశాబ్దకాలం నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి అడుగుపెట్టాడు ఈ 30 ఏళ్ల క్రికెటర్.

సౌరభ్ కుమార్.. ప్రస్తుతం భారత క్రికెటర్ లో చర్చనీయాంశంగా మారిన పేరు. దశాబ్దకాలం నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి అడుగుపెట్టాడు ఈ 30 ఏళ్ల క్రికెటర్.

Saurabh Kumar: దశాబ్ద కాలం నిరీక్షణ.. 30 ఏళ్లకు టీమిండియాలోకి! ఎవరీ సౌరభ్ కుమార్?

సౌరభ్ కుమార్.. ప్రస్తుతం భారత క్రికెటర్ లో చర్చనీయాంశంగా మారిన పేరు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయపడటంతో.. జట్టుకు దూరమైయ్యారు. దీంతో వీరి స్థానంలో టీమ్ లోకి వచ్చారు సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమర్, వాషింగ్టన్ సుందర్ లకు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. అయితే సర్ఫరాజ్ ఖాన్, సుందర్ లు అభిమానులకు పరిచయమే. కానీ సౌరభ్ కుమర్ ఎవరు? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. మరి దేశవాళీ క్రికెట్ లో దశాబ్దకాలం అనుభవం ఉన్న ఈ 30 ఏళ్ల ఆటగాడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1993 మే 1న ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పట్ లో జన్మించాడు సౌరభ్ కుమార్. ఎడమచేతి వాటం స్పిన్నర్ గా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. బౌలింగ్ తో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాటింగ్ లోనూ దుమ్మురేపగల దమ్మున్న ప్లేయర్ సౌరభ్. ఇక అతడికి దేశవాళీ క్రికెట్ లో దశాబ్దకాలం అనుభవం ఉంది. 2015-16 సీజన్ లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో టీ20 ఫార్మాట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో సిద్దహస్తుడు సౌరభ్. 2017-18 రంజీ ట్రోఫీలో యూపీ తరఫున కేవలం నాలుగు మ్యాచ్ ల్లోనే 23 వికెట్లు పడగొట్టి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

who is shourab kumar

ఇక ఈ ఫర్మామెన్స్ తోనే ఐపీఎల్ లో 2017 సీజన్ కోసం రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ యాజమాన్యం రూ. 10 లక్షల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. రంజీ, దూలీప్ ట్రోఫీ లాంటి డొమెస్టిక్ టోర్నీల్లో సంచలన ప్రదర్శనలు ఇస్తూ.. సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో 2022లో శ్రీలంకతో జరిగిన సిరీస్ కు ఎంపిక చేశారు. కానీ ఆడే అవకాశం మాత్రం దగ్గలేదు. ఇక 2021లో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ కు నెట్ బౌలర్ గా తీసుకున్నారు. అతడిని గత కొంతకాలంగా పరిశీలిస్తూ వస్తున్న బీసీసీఐ.. ఇప్పుడు జాతీయ జట్టులోకి ఆహ్వానించింది.

కాగా.. 30 ఏళ్ల సౌరభ్ కుమార్ ఇప్పటి వరకు 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 290 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇటీవల అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టి మరోసారి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అదీకాక బ్యాట్ తో తొలి ఇన్నింగ్స్ లో 77 పరుగులు చేసి.. తనలో ఉపయుక్తమైన బ్యాటర్ కూడా ఉన్నాడని నిరూపించాడు. రవీంద్ర జడేజా గాయపడటంతో.. ఆల్ రౌండర్ల జాబితాలో సౌరభ్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లను కాదని ప్లేయింగ్ 11లో చోటు సంపాదించుకోగలడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి దేశవాళీ క్రికెట్ లో దశాబ్దకాలం అనుభవం ఉన్న సౌరభ్ కుమార్ టీమిండియాలోకి అరంగేట్రం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి