iDreamPost

కోటీశ్వరులు ఎక్క‌డ ఇన్వెస్ట్ చేస్తారు? వాళ్ల‌నుంచి మ‌నం ఏం నేర్చుకోవ‌చ్చు?

స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం ఒక మంచి ఆప్ష‌న్. కాని మార్కెట్ రిస్క్ ఎక్కువ‌. స్టాక్ మార్కెట్లో బెర్క్‌షైర్ హాత్వే $43.8 బిలియన్లను కోల్పోయిన తర్వాత వారెన్ బఫెట్, మార్కెట్ రిస్క్ గురించి వివ‌రంగా చెప్ప‌గ‌ల‌రు. నిజానికి అంద‌రూ స్టాక్స్ లో డ‌బ్బును సంపాదించ‌లేరు.

స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం ఒక మంచి ఆప్ష‌న్. కాని మార్కెట్ రిస్క్ ఎక్కువ‌. స్టాక్ మార్కెట్లో బెర్క్‌షైర్ హాత్వే $43.8 బిలియన్లను కోల్పోయిన తర్వాత వారెన్ బఫెట్, మార్కెట్ రిస్క్ గురించి వివ‌రంగా చెప్ప‌గ‌ల‌రు. నిజానికి అంద‌రూ స్టాక్స్ లో డ‌బ్బును సంపాదించ‌లేరు.

కోటీశ్వరులు ఎక్క‌డ ఇన్వెస్ట్ చేస్తారు? వాళ్ల‌నుంచి మ‌నం ఏం నేర్చుకోవ‌చ్చు?

మీ ద‌గ్గ‌ర ప‌ది ల‌క్ష‌ల డ‌బ్బు ఉంది. మ‌రి దాన్ని ఎక్క‌డ పెట్టుబ‌డి పెడతారు? ఎక్క‌డైనా స్థ‌లం కొంటారా? బంగారం కొని దాచుకొంటారా? మ‌రి అదే కోటీశ్వ‌రులు ఎక్క‌డ ఇన్వెస్ట్ చేస్తారు? వాళ్ల పెట్టుబ‌డి వ్యూహం ఎలా ఉంటుంది?

స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం ఒక మంచి ఆప్ష‌న్. కాని మార్కెట్ రిస్క్ ఎక్కువ‌. స్టాక్ మార్కెట్లో బెర్క్‌షైర్ హాత్వే $43.8 బిలియన్లను కోల్పోయిన తర్వాత వారెన్ బఫెట్, మార్కెట్ రిస్క్ గురించి వివ‌రంగా చెప్ప‌గ‌ల‌రు. నిజానికి అంద‌రూ స్టాక్స్ లో డ‌బ్బును సంపాదించ‌లేరు. ఆ క‌ళ వేరు!

చాలా మంది సంపన్న పెట్టుబడిదారులు బ్యాంకులో కోట్ల బ్యాలెన్స్ లేక‌పోయినా, పాత ప‌ద్ద‌తుల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. చాలా మంది ఇన్వెస్ట‌ర్లు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్ల క‌న్నా చాలా డ్రెడిష‌న‌ల్ గానే ఆలోచిస్తారు. ఇది నిజంకూడా. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఎక్క‌వ‌మంది బంగారంమీదే పెట్టుబ‌డి పెడ‌తారు. సంపదను రక్షించే ఈ మార్గం, కోటీశ్వరులకు చాలా ఇష్ట‌మైంది. సంపద‌లో 5 -10% మధ్య బంగారంలో పెట్టుబ‌డి పెడ‌తారు. ఇది చాలా న‌మ్మ‌క‌మైన‌, తెలివైన ప‌ద్ధ‌తి.

సంపన్న పెట్టుబడిదారుల‌కు డ‌బ్బును పుట్టించే క‌ళ‌కూడా తెలుసు. వాళ్లు కోట్ల విలువ చేసే పేయింట్స్ , ప్రొప‌ర్టీస్ కొంటారు. ఎదుగుతున్న‌క‌ళాకారుల పెయింట్స్, వాళ్ల క్రియేష‌న్స్ కొంటున్న‌ప్పుడు వాళ్లు మ‌హారాజ‌పోష‌కుల్లా, క‌ళ కోసం కోట్లను ఖ‌ర్చుచేస్తున్న‌వాళ్ల‌గా క‌నిపిస్తారు. నిజానికి ఇది మంచి పెట్టుబ‌డి. తెలివిగా ఎంచుకుంటే, ఈ పెట్టుబడులు యేడాదికి యేడాది విలువను పెంచుతాయి, వాటిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఒక‌వేళ పెయింట్స్ ను కొంటే, వాటిని భ‌ద్రంగా దాచుకొంటేచాలు. మంచి ప్రైస్ వ‌చ్చిన త‌ర్వాత వేలంపాట‌లో పెట్ట‌డ‌ట‌మే.
Where do millionaires invest What can we learn from them
ఇక మూడో పెట్టుబ‌డి వ్యూహం రియల్ ఎస్టేట్‌. ఇది సురక్షితమైన ఎంపిక. రియల్ ఎస్టేట్ నెమ్మ‌దిగా, కొన్ని సార్లు చాలా వేగంగా విలువ‌ను పెంచుతుంది. అదృష్టం పండితే, ఒక్క యేడాదిలోనే మంచి లాభాలు వ‌స్తాయి. సంప‌న్నులు, సెల‌బ్రిటీలు తరచుగా ఇళ్లను ఎందుకు కొంటారు? ఎందుకు అమ్ముతారు? ఇదే అంతుబ‌ట్ట‌ని పెట్టుబ‌డి లెక్క కాదు. వాళ్లు ఉంటున్న ఏరియాలో రేట్లు పెరుగుతాయి. లేదంటే పెరిగే చోట్ల వాళ్లు స్థ‌లాలు, భ‌వంతులుకొంటారు. ఆ ఏరియాకు పాపులారిటీ పెరుగుతున్న కొద్దీ, రేట్లు పెరుగుతాయి.

డ‌బ్బున్న‌ పెట్టుబడిదారులు వారి వ్యక్తిగత ఆస‌క్తులు, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి, అదృష్టాన్ని రక్షించుకోవడానికి , విలువ పెంచుకోవ‌డానికి ఈ వ్యూహాలను ఎంచుకుంటారు. మీరు క్లాసిక్స్ ను న‌మ్ముకోవ‌చ్చు. అది పెట్టుబ‌డుల‌కు కూడా వ‌ర్తిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి