iDreamPost

అమ్మవారికి పెట్టిన చీరలు కడుతున్నారా? ఈ తప్పులు చేస్తే మహా పాపం!

  • Published Mar 23, 2024 | 2:33 PMUpdated Mar 23, 2024 | 2:33 PM

సాధారణంగా కొన్ని దేవాలయాల్లో అమ్మవారు కట్టిన చీరలను వేలం వేయడం, ధర కట్టి అమ్మడం విషయం అందరికీ తెలిసిందే. మరి అలా అమ్ముతున్న చీరలను చాలామంది పోటీ పడి కొనుక్కుంటారు. అయితే అలా కొనుక్కున్న చీరలు ఈ సమయాల్లో అస్సులు కట్టుకోకూడాదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా కొన్ని దేవాలయాల్లో అమ్మవారు కట్టిన చీరలను వేలం వేయడం, ధర కట్టి అమ్మడం విషయం అందరికీ తెలిసిందే. మరి అలా అమ్ముతున్న చీరలను చాలామంది పోటీ పడి కొనుక్కుంటారు. అయితే అలా కొనుక్కున్న చీరలు ఈ సమయాల్లో అస్సులు కట్టుకోకూడాదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

  • Published Mar 23, 2024 | 2:33 PMUpdated Mar 23, 2024 | 2:33 PM
అమ్మవారికి పెట్టిన చీరలు కడుతున్నారా? ఈ తప్పులు  చేస్తే మహా పాపం!

భారతదేశం అంటే సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు వంటిదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే..ఈ దేశంలో ఓ వైపు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కాలంలో.. ఇంకా సంస్కృతి సంప్రదాయాలను మార్చిపోకుండా ఆచారిస్తునే ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలోని హిందువులకు దేవుడన్నా, దైవ కార్యలకు సంబంధిచిన ఆచారాలన్నా.. ఎనలేని భక్తి, మూఢ విశ్వసంతో ఉంటారు. ఈ క్రమంలోనే ఆ దేవుడికి సమర్పించిన వస్త్రాలు, ప్రసాదాలు, పువ్వులు అనేవి ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. ఇప్పటికి చాలామంది కొన్ని ఆలయాలను సందర్శించినప్పడు అక్కడ.. అమ్మవార్లకు కట్టిన చీరలను పోటీపడి మరీ కొనుక్కుంటారు. మరి,అలా అమ్మవార్లకు సమర్పించిన చీరలను మహిళలు కొనుక్కొని వాటిని ధరిస్తూంటారు. అయితే ఆ అమ్మవారు చీరలను మహిళలు ఇలాంటి సమయంలో మాత్రం అస్సలు కట్టుకోకూడాదు.

సాధారణంగా కొన్ని దేవాలయాల్లో అమ్మవారు కట్టిన చీరలను వేలం వేయడం, ధర కట్టి అమ్మడం విషయం అందరికీ తెలిసిందే. అలా అమ్ముతున్న చీరలన చాలామంది భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తూ కొనుక్కుంటారు. మరి, అలా ఎంతో ఇష్టంగా భక్తితో కొనుకున్న అమ్మవారు చీరలను ఎప్పుడు కట్టుకోవాలనే సందేహం చాలామందిలో కలుగుతుంటుంది. అయితే అమ్మవారికి కట్టిన చీరలను సాధారణ భక్తులు నిరభ్యంతరంగా ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కానీ, ఆ వస్త్రాలు ధరించినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మరి, ఏ సమయాల్లో అమ్మవారు చీరలు కట్టుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పీరియడ్స్

చాలామంది మహిళలు తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. నెలసరి సమయంలో అమ్మవారి చీరను అస్సలు కట్టుకోకూడదు. ఎందుకంటే..   ఆ విధంగా చేస్తే  ఆ చీర అపవిత్రమవుతుందని, అలాగే  ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుందని భావిస్తుంటారు.

నాన్ వెజ్ తింటూ

కొంతమంది మహిళలు అమ్మవారు చీరను ఫంక్షన్లకు కట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే అలా పంక్షన్స్ కు వెళ్లిన వారు అదే చీరలో నాన్ వెజ్ తింటూ ఉంటారు. అలా చేయడం ఎంత వరకు మంచింది కాదనీ, దీనివల్ల అమ్మవారు ఆగ్రహిస్తుందని చాలామంది అంటున్నారు.

ఇలా భద్రపరచాలి

ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే.. చాలామంది మహిళలు అమ్మవారి చీర తీసుకువచ్చి, ఇంట్లో బెడ్ పై లేదంటే ఇతర ప్రదేశాల్లో పెడుతూ ఉంటారు. కానీ, అలా చేయకూడదట. ఎందుకంటే..  ఆ అమ్మవారి చీరకు శక్తి ఉంటుందని, కాబట్టి ఇంట్లో రెగ్యులర్ గా ఉండే బట్టల్లో కాకుండా బీరువాలో ఓ మూలలో పెట్టుకోవలని  ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడు కట్టుకోవాలి

సహజంగా అమ్మవారి చీరలో అత్యధిక శక్తి ఉంటుంది. కాబట్టి, ఈ చీరను ఏ సమయంలో కట్టుకోవాలంటే.. దేవాలయాలకు వెళుతున్నప్పుడు, దాన ధర్మాలు చేస్తున్నప్పుడు, వ్రతాలు, పూజలు చేస్తున్నప్పుడు, ఆశీర్వచనాలు ఇచ్చేటప్పుడు, దేవున్ని ఆరాధించేటప్పుడు ధరిస్తే ఆ దేవత   అనుగ్రహం ఉండడమే కాకుండా.. మనం చేసే పని శుభం జరుగుతుందని, అలాగే  ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. దీనివల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.  మరి, అమ్మవారు చీరలను ఏ సమయంలో కట్టుకోకూడదు,  అనే విషయాల పై మీ అభిప్రయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి